గాల్వాన్ లోయలో భారత్ – చైనా మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన మొత్తం 224 యాప్స్ ని ఇండియాలో బ్యాన్ చేసింది. అందులో, ప్రపంచవ్యాప్తంగా భాగా గుర్తింపు పొందిన పబ్జీ గేమ్ కూడా ఉంది. అయితే, దాని స్థానంలో ఆత్మ నిర్బర్ భారత్ లో భాగంగా FAU- G అనే గేమింగ్ యాప్ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా FAU- G గేమింగ్ యాప్ ఫస్ట్ లుక్ కూడా సినిమా రేంజ్‌లో టీజర్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. టీజర్‌ వీడియోను తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ‘ఈ రోజు మనం చెడుపై మంచి జరిపిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భయంలేని, ఐక్యతా గార్డులు FAU-G గురించి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకు మించి మంచి రోజు ఏముంటుంది. దసరా పర్వదినం రోజు FAU-G టీజర్‌ను ప్రజెంట్ చేస్తున్నాం.’ అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. FAU-G లో ఎఫ్ అంటే ఫియర్ లెస్, యు అంటే యునైటెడ్, జి అంటే గార్డ్స్ అని అర్దం. భారత్‌లో PUBGని బ్యాన్ చేసిన తర్వాత భారత కంపెనీ అయిన nCORE games ఈ FAU-Gని తయారు చేస్తున్నట్టు ప్రకటించారు.(చదవండి: యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చిన వాట్సప్)

ఒక నిమిషం పాటు ఉన్న ఈ టిజర్ లో గాల్వన్ లోయలో జరిగిన సన్నివేశాలు ఉన్నాయి. భారత్, చైనీస్ బలగాల మధ్య జరిగిన ఘర్షణ, ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందనే అంశాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. భారత సైన్యం యొక్క ధైర్యసాహసాలను ప్రతిబింబించేలా ఆ టీజర్ ఉంది. FAU-G త్వరలో మార్కెట్లోకి రానుంది. మొదట అక్టోబర్ చివరి నాటికి మార్కెట్లోకి తీసుకురావాలని భావించారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు మరికొన్ని వారాల్లో FAU-G అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నవంబర్‌లో రావొచ్చని భావిస్తున్నారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here