ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్ షాక్ ఇచ్చింది. శుక్రవారం రాత్రి సాంకేతిక సమస్యల కారణంగా సోషల్ మీడియా క్రాష్ అయినట్లు తెలుస్తుంది. చాలా మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ యాప్ పనిచేయడం లేదని ట్విట్టర్‌లో #InstagramCrashing చేసిన టాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్, రెడ్డిట్ మరియు డౌన్‌డెక్టర్ యొక్క ఫోరమ్‌లలోని పిర్యాదు చేసిన ప్రకారం వారి ఇన్‌స్టాగ్రామ్ యాప్ వారి ఫోన్‌లో పదేపదే క్రాష్ అవుతున్నట్లు పెద్ద సంఖ్యలో ప్రజలు చెప్తున్నారు. ఎక్కువ శాతం ఆండ్రాయిడ్ యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొనట్లు తెలుస్తుంది. కొద్దీ సేపటి వరకు పని చేయకుండా పోయిన ఇన్‌స్టాగ్రామ్ కాసేపటికి సర్దుకున్నట్లు తెలుస్తుంది.

ఇంకా చదవండి: పీఎం వాణి పబ్లిక్‌ వైఫైతో 2 కోట్ల మందికి ఉపాధి

యూజర్లు మాత్రం ఈ సమస్య గురుంచి సోషల్ మీడియాలో మీమ్స్, జోక్స్ తో ట్రోల్ చేశారు. ఎక్కువ సంఖ్యలో యూజర్లు పెరగడంతో సర్వర్ లో ఏర్పడిన సాంకేతిక కారణంగా ఇలా జరిగినట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికీ కొద్దీ మంది వినియోగదారుల మొబైల్స్ లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ పనిచేయడం లేదని పిర్యాదు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఫోన్‌లో అన్‌ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కూడా క్రాష్ అవుతూనే ఉందని తెలుపుతున్నారు. ఈ వారంలో జీమెయిల్, యూట్యూబ్, డ్రైవ్ సేవలు 45 నిమిషాల పాటు నిలిచిపోయిన సంగతి మనకు తెలిసిందే.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.