ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సప్ రోజు రోజుకి తన యూజర్లకు కొత్త కొత్త అప్డేట్స్ ని అందిస్తుంది. ఇప్పటికే మొబైల్ ఫోన్ లో ఇతరులు చాట్ చూసే వీలు లేకుండా యూజర్లకు భద్రత పరంగా ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందిస్తుంది. ఇప్పుడే అలాంటి ఫీచర్ ని వెబ్ యూజర్లకు కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. దీంతో పాటు మరికొన్ని ఫీచర్లను బీటా యూజర్లకు అందిస్తుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • వాట్సప్ లో మనకు గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ ఉన్న సంగతి మనకి తెలిసిందే. అయితే మనకు వచ్చే వీడియో కాల్ అనేది వ్యక్తిగత కాల్ లేదా గ్రూప్ వీడియో కాల్ అనేది మనకు సార్లు అర్దం కాదు. అందుకే ఈ సమస్యను నివారించడం కోసం వాట్సప్ వేర్వేరు రింగ్ టోన్స్ తీసుకొస్తుంది. వ్యక్తి గత కాల్ కి మరియు గ్రూప్ వీడియో కాల్ కి పెట్టుకోవచ్చు. దీని ద్వారా మనకు గ్రూప్ కాల్ వస్తే అలర్ట్ కావొచ్చు.
  • ఇప్పటివరకు మనకు వెబ్ యూజర్లకు అందుబాటులో ఉన్నా డూడుల్స్ సౌకర్యాన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో తీసుకొస్తునట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు డెస్క్‌టాప్‌, వెబ్‌ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న వాట్సాప్ డూడుల్స్‌ ఇక నుంచి ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లోనూ రానుంది. కొత్తగా బ్యాక్‌గ్రౌండ్‌ డూడుల్స్‌ను మెసేజింగ్‌ యాప్‌లోనే యూజర్లకు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డూడుల్స్‌ యాప్‌ను వేరేగా డౌన్‌లోడ్‌ చేసుకోకుండానే వాట్సాప్‌లోనే రావొచ్చని నిపుణుల అభిప్రాయం.
  • కాలింగ్‌ ఇప్రూవ్‌మెంట్‌ కోసం యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పైభాగంలో ఉండే కాలింగ్‌ బటన్‌ను అప్‌డేషన్‌లో భాగంగా కింది భాగానికి తీసుకురానుంది. ఇన్‌ఫో, ఆడియో, వీడియో, కెమెరా బటన్స్‌తోపాటు మెసేజింగ్‌ బటన్‌ కూడా ఉండనుంది.
  • వాట్సాప్‌ అప్‌డేట్‌లో భాగంగా యూజర్ల కోసం మరిన్ని యానిమేటెడ్‌ స్టిక్కర్స్‌ను అందుబాటులోకి తేనుంది. వినూత్నమైన స్టిక్కర్స్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులకు మరింత వినోదం కలగనుంది. స్నేహితుల కామెంట్లకు, మెసేజ్‌లకు స్పందించేందుకు సరదాగా స్టిక్కర్లను వినియోగించుకోవచ్చు.
  • వాట్సాప్‌ బిజినెస్‌ ఖాతా కలిగిన వారికి అదనపు ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. పోర్టిఫోలియోకు షార్ట్‌కట్‌గా కాటలాగ్‌ ఫీచర్‌ను జోడించనుంది. వ్యాపార ఖాతా నిర్వహించేవారికి మరో అదనపు ఫీచర్‌ను వాట్సాప్‌ ఇవ్వనుంది. ఈ యాప్‌లో అదనంగా మరో కొత్త కాల్‌బటన్‌ను కల్పించనుంది.