COVID-19 కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 32 మిలియన్లకు పైగా కేసులతో కరోనా వైరస్ విజృంబిస్తుంది, ఈ సమయంలో టెక్నాలజీ దిగ్గజం గూగుల్ బుధవారం తన గూగుల్ మ్యాప్స్ లో కరోనా వైరస్ కోసం కొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో ఏయే ప్రదేశాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి అనే వివరాలు వినియోగదారులకు తెలిసేలా కొత్త ఫీచర్ ని  అభివృద్ధి చేసింది. ఇది వినియోగదారులకు నిర్దిష్ట ప్రాంతానికి వెళ్లాలా వద్దా అనే నిర్ణయాలు తీసుకోవడానికి కరోనా ఫీచర్ సహాయపడుతుంది. 220 దేశాలలో COVID లేయర్ ఫీచర్‌ను ఉపయోగించి వినియోగదారులు సమాచారాన్ని పొందవచ్చు. ఈ వారం నుండి ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్‌ఫామ్‌లలో ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త ఫీచర్‌ను అందిచాలని గూగుల్ యోచిస్తోంది. మీరు ఎంచుకున్న ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందా, తగ్గుతోందా, కేసుల వ్యాప్తి ఎలా ఉందనే పూర్తి వివరాలను గూగుల్ మ్యాప్స్ వినియోగదారులకు అందిస్తుంది.(చదవండి:అసలు టీఆర్‌పీ రేటింగ్ అంటే ఏమిటి)

Image: Google

COVID లేయర్ ఫీచర్ ఎలా పని చేస్తుంది? 

మ్యాప్స్ లో ‘COVID-19 info’ అనే లేయర్ టూల్ ద్వారా ఈ ఫీచర్ను వాడుకోవచ్చు. ఈ ఫీచర్ పనితీరు గురించి గూగుల్ మ్యాప్స్ ప్రొడక్ట్ మేనేజర్ సుజోయ్ బెనర్జీ కంపెనీ బ్లాగులో రాశారు. వినియోగదారులు గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసిన తరువాత స్క్రీన్ కుడి ఎగువ భాగంలో ఉన్న లేయర్ టాబ్‌లో ‘COVID-19 info(కోవిడ్ -19 సమాచారం)’ పై క్లిక్ చేసి వాడుకోవచ్చు. ముందు ఏదైనా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని, కొవిడ్-19 info ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలి. ఆ ప్రాంతంలో గత వారం రోజులుగా ప్రతి లక్ష మందిలో నమోదైన సగటు COVID కేసులను వినియోగదారులకు చూపుతుంది. మీరు చూస్తున్న మ్యాప్ యొక్క ప్రాంతంలో 1,00,000 మందికి ఏడు రోజుల సగటు కొత్త కోవిడ్ కేసులు మరియు కేసులు పైకి లేదా క్రిందికి ట్రెండ్ అవుతున్నాయా అని సూచించే లేబుల్‌ను మీరు చూస్తారు.

గూగుల్ మ్యాప్స్ పనిచేసే 220 దేశాలు, రాష్ట్రాలు, ప్రావిన్స్లు, కౌంటీలు, డేటా అందుబాటులో ఉన్న అన్ని నగరాల్లో ఈ సేవలు అందిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. దీంతో పాటు మన దేశం మొత్తం నమోదవుతున్న కేసుల డేటా కూడా ఇందులో కనిపిస్తుంది. 

గూగుల్ ఈ డేటాను ఎలా సేకరిస్తుంది?

ప్రాంతాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను నమ్మదగిన సోర్సుల ద్వారా సేకరిస్తామని గూగుల్ పేర్కొంది. సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వ ఆరోగ్య శాఖలతో పాటు రాష్ట్ర, స్థానిక ఆరోగ్య సంస్థలు, ఆసుపత్రుల నుంచి ప్రాంతాల వారీగా కేసుల సంఖ్యను వార్తా సంస్థలు, వికీపీడియా సేకరిస్తాయి. ఈ డేటానే వార్తా సంస్థలు, వికీపీడియా నుంచి గూగుల్ సేకరిస్తుంది. ఇలాంటి నమ్మదగిన సోర్సుల ద్వారా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు తెలుసుకోవడం వల్ల తమ వినియోగదారులకు వందశాతం కచ్చితత్త్వంతో సేవలు అందిచగలమని గూగుల్ చెబుతోంది. ఒకవేళ ప్రాంతాల వారీగా కేసుల సంఖ్యను గూగుల్ సెర్చ్ లో  వెతికినా, సమాచారం ఇచ్చే సోర్స్ లు ఇవే కావడం విశేషం.

“జనాదరణ పొందిన ప్రాంతాలలో మరియు ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాలలో, రవాణా సమయాలలో కోవిడ్ -19 హెచ్చరికలు జారీ చేస్తుంది. మీరు బయటికి వెళ్లినప్పుడు సురక్షితంగా ఉండటానికి సహాయపడటానికి రూపొందించమని” గూగుల్ మ్యాప్స్ సుజోయ్ బెనర్జీ ప్రొడక్ట్ మేనేజర్ బుధవారం ప్రకటించారు.(చదవండి:అసలు టీఆర్‌పీ రేటింగ్ అంటే ఏమిటి)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here