Battlegrounds Mobile India: గత ఏడాది నిషేదింపబడిన పబ్జీ మొబైల్ ఇండియా కొత్త పేరుతో తిరిగి భారత్ లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో రాబోతున్న పబ్జీ(PUBG)ని దేశంలో నిషేదించాలని కోరుతూ అరుణాచల్ ప్రదేశ్ శాసన సభ సభ్యుడు నినోంగ్ శనివారం ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. ఈ కొత్త గేమ్ ను దేశంలోకి తీసుకొని రావడానికి దానిని అభివృద్ది చేసిన క్రాఫ్ట్టన్(KRAFTON) భారతీయ చట్టాలను పక్కదారి పట్టించినట్లు ఆయన ఆరోపించారు.
దక్షిణ కొరియా కంపెనీ ఇటీవల ఈ గేమ్ ను తిరిగి తీసుకురావడం కోసం గూగుల్ ప్లే స్టోర్ లో ప్రీ రిజిస్ట్రేషన్లు తీసుకోవడం ప్రారంభించింది. ఎప్పుడు దీనిని ఇండియాలో విడుదల చేస్తారో అనే దానిపై స్పష్టత లేదు. గత ఏడాది డేటా గోప్యత భద్రత కారణంగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పబ్జీ మొబైల్ ఇండియా మరో రూపమే ఈ గేమ్. “కేవలం చిన్న చిన్న మార్పులు చేసి అదే గేమ్ ని తిరిగి ప్రారంభించడానికి, పిల్లలతో సహా లక్షలాది మంది మన పౌరుల వినియోగదారు డేటాను ఇతర విదేశీ కంపెనీలకు, చైనా ప్రభుత్వానికి బదిలీ చేయడానికి కంపెనీ చేస్తున్న ఒక మోసం అని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పాసిఘాట్ వెస్ట్ అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న” ఎరింగ్ తన లేఖలో తెలిపారు.
దీనికి సంబందించిన మూడు పేజీల లేఖ కాపీని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. గత ఏడాది సెప్టెంబర్ లో ప్రభుత్వం పబ్జీ మొబైల్ నిషేదించిన తర్వాత క్రాఫ్ట్టన్ భారతదేశంలో తిరిగి తీసుకొనిరావడనికి ఈ గేమ్ ను చైనా టెన్సెంట్ గేమ్స్ నుంచి ప్రచురణ & పంపిణీ హక్కులను తీసుకుంది. అయినప్పటికీ టెన్సెంట్ గేమ్స్ సంస్థ ఇప్పటికీ ఇతర దేశాలలో పబ్జీకి ప్రచురణకర్త & పంపిణీదారుగా ఉంది. సీనియర్ మేనేజ్ మెంట్ బృందంతో సహా ఇతర భారతీయ ఉద్యోగులందరిని డిసెంబర్ లో క్రాఫ్ట్టన్ నియమించుకున్నట్లు ఎరింగ్ లేఖలో తెలిపారు.

మన దేశ రహస్యాలను ఇతర దేశాలతో పంచుకునే ఆస్కారం ఎక్కువ అని అన్నారు. అందుకే ఈ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాని దేశంలోకి మళ్లీ తీసుకొని రాకుండా ఉండటానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది అనేది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.