ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధమైన పబ్ జీ మొబైల్ గేమ్ ను చైనాతో జరిగిన ఘర్షణ నేపథ్యంలో సెప్టెంబర్ 2న భారతదేశంలో నిషేదించిన సంగతి మనకు తెలిసిందే. పబ్ జీ గేమ్ నిషేదం తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా స్వదేశీ మల్టీ ప్లేయర్ గేమ్ ఫౌ-జీను త్వరలో తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈ గేమ్ లో భారత సైనిక బలగాల పరాక్రమలను తెలియజేసె విదంగా రూపొందిస్తున్నారు. ఈ గేమ్‌లో మొదటి లెవల్ భారత్-చైనా మధ్య గాల్వాన్ లోయ వివాదం నేపథ్యంలో సాగుతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ రిలీజ్ చేశారు. (చదవండి: పబ్ జీ గేమ్ టోర్నీలో గెలిస్తే రూ. 6కోట్లు మీవే!)
ఒక సంవత్సరంలో 20 కోట్ల మంది యూజర్లను చేరాలనేదే తమ లక్ష్యమని ఎన్‌కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకులు విశాల్ గోండల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎన్‌కోర్ గేమ్స్ పబ్ జీ పోటీగా గేమ్ ని రూపోదించడానికి అత్యంత గేమింగ్ నిపుణులైన టాప్-25 డెవలపర్లు, టెస్టర్లు, కళాకారులు, డిజైనర్స్ వంటి నిపుణులను ఎంచుకున్నట్లు తెలిపింది. గతంలో నవంబర్ తర్వాత గేమ్ ని తీసుకురానునట్లు కంపెనీ పేర్కొంది. తాజాగా పబ్ జీ గేమ్ వచ్చే నెలలో తీసుకున్న నేపథ్యంలో దానికి పోటీగా ఫౌ-జీ గేమ్ ని తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తునట్లు సమాచారం.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.