వాట్సాప్ తన కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చినప్పటి నుంచి టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ప్రత్యర్థి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లకు వినియోగదారులు ఎక్కువ సంఖ్యలో తరలిపోతున్నారు. ముఖ్యంగా సిగ్నల్ యాప్ డౌన్లోడ్ సంఖ్య ఊహించని రీతిలో పెరిగిపోయింది. ఎంతలా అంటే? ఈ దెబ్బకి ఆపిల్ యాప్ స్టోర్‌లో సిగ్నల్ టాప్ యాప్‌గా అవతరించింది. తరువాత స్థానంలో టెలిగ్రామ్ ఉంది. సెన్సార్ టవర్ డేటా నివేదికల ప్రకారం, 2020 డిసెంబర్ 26 నుంచి జనవరి 1-6-2021 మధ్య సిగ్నల్ డౌన్‌లోడ్‌ల సంఖ్య భారతదేశంలో 79% పెరిగాయి. టెలిగ్రామ్ యాప్ డౌన్‌లోడ్‌ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు నివేదికలు తెలిపాయి.(ఇంకా చదవండి: వాట్సాప్‌లో ఈ మెసేజ్ లతో జర జాగ్రత్త!)

వాట్సాప్ కి పోటీగా సిగ్నల్ యాప్ కూడా కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ అందిస్తుంది. అందుకే చాలా మంది వినియోగదారులు సిగ్నల్ యాప్ ఇష్టపడటానికి ఇది ఒక ప్రధాన కారణం. ఈ ప్లాట్‌ఫామ్‌లలో వాట్సాప్ లాంటి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? వాట్సాప్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫీచర్లతో పాటు మరికొన్ని ఇతర ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి.

సిగ్నల్ బ్లర్ టూల్:

వాట్సాప్ లో లేని సిగ్నల్ యాప్ లో ఉన్న అద్భుతమైన ఫీచర్ లలో ఈ బ్లర్ టూల్ అనేది చాలా ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జాత్యహంకారానికి, పోలీసు క్రూరత్వానికి వ్యతిరేకంగా కవాతు నిరసన వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే. జార్జ్ ఫ్లాయిడ్ గతంలో బ్రయోనా టేలర్ అనే పోలీసు చేత హత్యకు గురికాబడ్డాడు. అప్పటి నుంచి సిగ్నల్ యాప్ నిరసనకారులకు మద్దతుగా ఈ ఫీచర్ ని తీసుకొచ్చింది. యూజర్లు ఫోటో తీసుకోగానే కింద చూపించిన విదంగా బ్లర్ టూల్ ని ఎంచుకుంటే సరిపోతుంది. దీని సహాయంతో మీ ఫేస్ ని సులభంగా బ్లర్ చేసుకోవచ్చు.

అలాగే ఇందులో బ్లర్ బటన్ పక్కన మీకు కనిపిస్తున్న స్టికర్ ఆప్షన్ ఎంచుకొని మీ ఫోటో మీద నచ్చిన స్టికర్ లను అతికించవచ్చు.

చాట్‌లను లాక్ చేయండి: వినియోగదారులు మీ చాట్‌లను వేలిముద్ర, టచ్‌ఐడి లేదా ఫేస్‌ఐడితో లాక్ చేయవచ్చు. వాట్సాప్ మాదిరిగానే సిగ్నల్ కూడా తమ వినియోగదారుల చాట్‌లను ప్రైవేట్‌గా ఉంచడానికి మద్దతును అందిస్తుంది.

డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్: సిగ్నల్ యాప్లో వాట్సాప్ మాదిరిగానే ఒక యూజర్​ మరో యూజర్​కు పంపిన సందేశం ఏడు రోజుల తర్వాత దానంతటదే డిలీట్ అయిపోయేలా డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ను తీసుకొచ్చింది. చాట్ లను సులభతరం చేయడం సహా గోప్యతకు ప్రాధాన్యతనిస్తూ ఈ ఫీచర్ తీసుకువస్తున్నట్లు వెల్లడించింది సిగ్నల్. సిగ్నల్ స్టోరేజ్​ను సమీక్షించడం, ఒకేసారి భారీ మొత్తంలో అన్నిరకాల సందేశాలను డిలీట్​ చేయడం వంటి వాటికోసం ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

చాట్ వాల్‌ పేపర్: వాబేటా ఇన్ఫో సమాచారం ప్రకారం తాజా బీటా నవీకరణలో, సిగ్నల్ క్రొత్త ఫీచర్లను విడుదల చేసింది, ఇది వినియోగదారులను చాట్ వాల్‌పేపర్‌ను మార్చడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటివరకు సిగ్నల్ ‌యాప్‌లో అందుబాటులో లేదు.

యానిమేటెడ్ స్టిక్కర్లు: వాట్సాప్‌లో లభించే యానిమేటెడ్ స్టిక్కర్లను కూడా సిగ్నల్ లాంచ్‌ చేసింది. “తాజా నవీకరణ మొదటి అధికారిక యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్” డే బై డే “తో పాటు యానిమేటెడ్ స్టిక్కర్లను ఫఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకోవచ్చు. అలాగే డెస్క్‌ టాప్‌ నుండి యానిమేటెడ్ స్టిక్కర్లను క్రియేట్‌ చేసుకోవచ్చు.(ఇంకా చదవండి: పవర్ బ్యాంక్ కొనడానికి ముందు మీరు వీటిని తెలుసకోండి!

గ్రూప్ కాల్స్: సిగ్నల్‌లో గ్రూప్ కాల్ ఫీచర్ ఉంది, కానీ ఐదుగురు పాల్గొనేందుకుమాత్రమే ఇప్పటిదాకా అనుమతి. ఈ పరిమితిని ప్రస్తుతం వాట్సాప్ మాదిరిగానే ఎనిమిదికి పెంచింది.

గ్రూప్ ఇన్‌వైట్‌ లింక్: గ్రూపులలో చేరేందుకు, ఇతర సిగ్నల్ వినియోగదారులను ఆహ్వానించడానికి సిగ్నల్ ఇప్పుడు గ్రూప్ ఇన్‌వైట్‌ లింక్ యాడ్‌ చేయడానికి అనుమతిస్తుంది.

క్రియేట్ గ్రూప్: సిగ్నల్ గ్రూప్ సహాయంతో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులతో సంభాషించడానికి సిగ్నల్ సపోర్ట్ చేస్తుంది. ఈ గ్రూప్ లో సభ్యుల చేరడానికి అడ్మిన్ ఆమోదం, సమూహ సమాచారాన్ని సవరించగల మరిన్ని పరిపాలనా నియంత్రణలు తన అధీనంలో ఉంటాయి.

ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్: ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ వాట్సాప్ యొక్క అతిపెద్ద ఫీచర్ ఈ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ కూడా సిగ్నల్ యాప్ లో ఉంది. ఈ సందేశాలను కేవలం ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రమే చదవగలరు. వీటితో పాటు ఇతర ఫీచర్స్ కూడా సిగ్నల్ యాప్ లో అందుబాటులో ఉన్నాయి.

మొత్తం వ్యాసం చదవడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here