ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వాడుతున్న వారికి మరో అలర్ట్. తాజాగా 10 ఆండ్రాయిడ్ యాప్స్ ఫేస్‌బుక్ యూజర్ల డేటాను దొంగలించినట్లు యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ తయారీ సంస్థ డాక్టర్ వెబ్ వెల్లడించింది. వీటిలో తొమ్మిది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ కోసం అందుబాటులో కొద్దీ రోజుల క్రితం వరకు అందుబాటులో ఉన్నాయని వాటి గురుంచి నివేదించిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు డాక్టర్ వెబ్ తెలిపింది. ఈ క్రింద పేర్కొన్న యాప్స్ ని అనేక మంది పైగా ఇన్స్టాల్ చేసుకున్నారని వెంటనే వాటిని మీ మొబైల్ నుంచి తొలిగించాలని డాక్టర్ వెబ్ వెల్లడించింది.

గూగుల్ తొలగించిన యాప్‌లు ఇవే..

  • పిఐపి ఫొటో (PIP Photo)
  • ప్రాసెసింగ్ ఫొటో (Processing Photo)
  • రబ్బిష్ క్లీనర్ (Rubbish Cleaner)
  • హారోస్కోప్ డైలీ (Horoscope Daily)
  • ఇన్‌వెల్‌ ఫిట్‌నెస్‌ (Inwell Fitness)
  • యాప్‌ లాక్ కీప్‌ (App Loc Keep)
  • లాకిట్ మాస్టర్‌ (Lockit Master)
  • హారోస్కోప్‌ పై (Horoscope Pi)
  • యాప్‌ లాక్ మేనేజర్‌ (App Lock Manager)

ప్రత్యేకమైన టెక్నాలజీ సాయంతో హ్యాకర్స్‌ యాప్‌లలోకి ప్రవేశించి సెట్టింగ్స్‌లో మార్పులు చేస్తున్నట్లు డాక్టర్ వెబ్‌ వెల్లడించింది. ఆ తర్వాత WebView.Next పేరుతో జావాస్క్రిప్ట్‌ సాయంతో ఫేస్‌బుక్ పేజీలో మార్పులు చేసి..యూజర్స్ లాగిన్‌, పాస్‌వర్డ్ వివరాలను సేకరించిన ట్రోజన్‌ యాప్స్‌ తమ సర్వర్లో సేవ్‌ చేసుకుంటున్నట్లు తెలిపింది. ఫేస్‌బుక్ యూజర్స్ తమ ఖాతాల్లోకి లాగిన్‌ అయినప్పుడు కుకీస్‌తో పాటు ఇతర డేటా వివరాలను సేకరించి సైబర్‌ నేరగాళ్లకు అందజేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ యాప్‌లను 10 లక్షల నుంచి 50 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అందుకే ఈ యాప్‌లను యూజర్స్ వెంటనే డిలీట్ చేయాలని గూగుల్ సూచించింది.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.