2020 ఏడాదిని చిన్న నుంచి 60ఏళ్ల వయస్సు గల వారికి ప్రతి ఒక్కరికీ వివిద రూపాలలో కన్నీరు మిగిల్చింది. అందరి కంటే ముఖ్యంగా యువతకు కరోనా కారణంగా 2021 మరిచిపోని సంవత్సరంగా గుర్తుండి పోతుంది. ఒక పక్క కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతుంటే, మరో పక్క సరిహద్దులో చైనాతో ఘర్షణ నేపథ్యంలో భద్రత కారణాలతో భారత ప్రభుత్వం ఇప్పటి వరకు చైనాకు చెందిన 267 యాప్స్ ను మన దేశంలో నిషేదించింది. దీంతో దేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన టిక్ టాక్ వీడియోలు కనుమారుగయ్యాయి. అలాగే పబ్​జీ యొక్క ‘చికెన్ డిన్నర్లు’ జాడ లేకుండా పోయింది. వీటితో పాటు మన దేశంలో ఎంతో పాపులర్ అయిన షేర్‌ఇట్, యుసి బ్రౌజర్, షెయిన్, లైక్, కామ్‌స్కానర్ వంటివి బ్యాన్ అయ్యాయి.

ఇంకా చదవండి: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదే!

లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్-చైనా ఘర్షణలకు నేపథ్యంలో మొదటి సారిగా చైనాకు చెందిన 59 యాప్స్ ను 2020 జూన్ 29న భద్రత కారణాల రీత్యా నిషేదం విధించింది. ఈ జాబితాలో టిక్‌టాక్, షేర్‌ఇట్, యుసి బ్రౌజర్, షెయిన్, లైక్, కామ్‌స్కానర్ వంటి యాప్స్ ఉన్నాయి. వీటికి భారతదేశంలో 100 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. అధికారిక ప్రకటన ప్రకారం.. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మీటీ) ఈ అనువర్తనాలు “భారతదేశం యొక్క సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, రాష్ట్ర భద్రత దృష్ట్యా” నిషేదించినట్లు పేర్కొన్నారు.

ఇవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సెక్షన్ 69ఎ కింద నిషేధించబడ్డాయి. సెప్టెంబర్ 5న మరో 118 యాప్స్ లను నిషేదించింది. ఈ జాబితాలో పబ్​జీ మొబైల్, పబ్​జీ మొబైల్ లైట్ వంటి యాప్స్ ఉన్నాయి. అలాగే నవంబర్ 24న మరో 43 యాప్స్ ఉన్నాయి. నిషేదిత జాబితాలో చైనాకు చెందిన చాలా ప్రముఖమైన యాప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టిక్ టాక్(TikTok)

టిక్ టాక్ ను నిషేదించే సమయానికి భారతదేశంలో 200 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. అప్పటికీ టిక్ టాక్ డౌన్లోడ్ సంఖ్య పెరగుతూనే ఉంది. అందుకే భారతదేశం నిషేధించినప్పటికీ టిక్‌టాక్ 2020లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్ గా నిలిచింది. 2019లో కూడా భారతదేశ సంస్కృతిని కించపరచడం, అశ్లీలతను ప్రోత్సాహిస్తున్నారనే కారణంతో టిక్ టాక్ ను నిషేదించాలని మద్రాస్ హైకోర్టులో కేసులు కూడా నమోదయ్యాయి.

పబ్​జీ మొబైల్(PUBG)


పబ్​జీ మొబైల్ గేమ్ కి భారతదేశంలో ఎంత ఫాలోయింగ్ ఉందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో దేశంలో 50 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉన్న గేమ్ ఇది. దేశంలో తక్కువ ధరకే శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ లు లభించడంతో పబ్​జీ మొబైల్ వృద్దికి దోహద పడుతుంది. ఎంట్రీ లెవల్ వినియోగదారుల కోసం కూడా పబ్​జీ మొబైల్ లైట్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 5న నిషేదించిన జాబితాలో పబ్​జీ గేమ్ ఉంది. తర్వాత తిరిగి దేశంలో ప్రవేశించడానికి పబ్​జీ కార్పొరేషన్ ప్రయత్నిస్తుంది.

యూసీ బ్రౌజర్(UC Browser)

యూసీ బ్రౌజర్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. 2015లో అత్యంత ప్రజాదరణ వెబ్ బ్రౌజర్ లలో మొదటి స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో యూసీ బ్రౌజర్ నిలిచింది. అలీబాబా గ్రూప్ యాజమాన్యంలోని యూసీ బ్రౌజర్ ను మైక్రోమాక్స్, కార్బన్, లావా, ఇంటెక్స్ వంటి మొబైల్స్ డిఫాల్ట్ గా యూసీని తీసుకురావడం నిలిపివేశాయి. దీంతో యూసీ బ్రౌజర్ వాటా రోజు రోజుకి క్షీణించింది. నవంబర్ 2019 నాటికి భారతదేశంలో సుమారు 16 శాతం ఉన్న మార్కెట్ వాటా జూలై 2020 నాటికి 6 శాతానికి తగ్గింది.

కామ్‌స్కానర్(Cam Scanner)


కామ్‌స్కానర్ భారతదేశంలో సుమారు 100 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉంది. దీంతో పత్రాలను త్వరగా స్కాన్ చేయడానికి మరియు వాటిని PDF లుగా లేదా JPEG ఫార్మాట్ లోకి మార్చడానికి ఈ యాప్ చాలా భాగా ఉపయోగపడింది. ప్రస్తుతం కామ్‌స్కానర్ కి అడోబ్ స్కాన్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్ వంటివీ ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి.

షేర్​ఇట్(Share It)


షేర్​ఇట్ 2019లో భారతదేశంలో నెలకు 200 మిలియన్ల ఆక్టివ్ యూజర్లు కలిగి ఉంది. ఈ యాప్ కంటెంట్ షేరింగ్ అప్లికేషన్‌గా ప్రారంభమైంది. తరువాత ప్రాంతీయ భాషల్లో లోకల్ కంటెంట్​, వీడియోలను స్ట్రీమ్ చేసే ప్లాట్‌ఫామ్‌గా విస్తరించింది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here