సామాజిక మాద్యమలలో మనం అనుసరించే వారు పెట్టిన పోస్ట్ లను చాలా సార్లు పోస్ట్ కి పెట్టిన టైటిల్ చూసి మనం మిత్రులకు, బందువులకు షేర్ చేస్తుంటాం. దీని వల్ల కొన్ని సార్లు చట్ట పరమైన చిక్కుల్లో పడటమే కాకుండా, వ్యక్తి గతంగా కూడా ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం చాలా ఎక్కువ. అయితే ఈ సమస్యను మనం ఎదుర్కోకుండా ఉండటానికి మనం తప్పని సరిగా ఆ పోస్ట్ ని చదివిన తర్వాత షేర్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే కొన్ని సార్లు మనం అనుకోకుండా చదవకుండానే షేర్ చేస్తాం. అయితే దీనిని నివారించడానికి ట్విట్టర్ సంస్థ కొత్త ఫీచర్ ని తీసకొస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా మనం చదవకుండా ఇతరులకు షేర్ చేస్తే మనకు ఈ పోస్ట్ ను చదవిన తర్వాత షేర్ చేయండి అని ఒక అలర్ట్ చూపిస్తుంది. దీని వల్ల ట్విట్టర్ ఖాతాదారులు చదివిన తర్వాత షేర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరని ట్విట్టర్ భావిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్ది మంది యూజర్ల మొబైల్ లలో పరక్షిస్తున్నట్లు తెలిపింది. త్వరలో ఈ ఫీచర్ ని అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారట.(చదవండి: టీవీని స్మార్ట్ టీవీ‌గా మార్చే అమెజాన్ కొత్త ఫైర్ టీవీ స్టిక్స్ విడుదల)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here