తుది నోటీసు: “విస్మరించవద్దు దయచేసి జాగ్రత్తగా చదవండి. హలో, నేను వరుణ్‌ పులియాని వాట్సాప్ డైరెక్టర్, ఈ సందేశం మా యూజర్లు అందరికీ మార్క్ జుకర్‌బర్గ్‌కు 19 బిలియన్ డాలర్లకు వాట్సాప్ అమ్మినట్లు తెలియజేయడం. వాట్సాప్ ఇప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ చేత నియంత్రించబడుతుంది. మీకు కనీసం 20 కాంటాక్ట్ లు ఉంటే, ఈ వచన సందేశాన్ని పంపండి మరియు మీ వాట్సాప్ లోగో 24 గంటల్లో ఫేస్‌బుక్ “f” తో కొత్త చిహ్నంగా మారుతుంది. ఫేస్‌బుక్ సేవలతో మీ క్రొత్త వాట్సాప్ ను పనిచేయడానికి ఈ సందేశాన్ని 10 మందికి పైగా ఫార్వార్డ్ చేయండి, లేకపోతే మీ క్రొత్త ఖాతా సర్వర్ల నుంచి తొలగించబడుతుంది” అని నకిలీ వాట్సాప్ సందేశంలో పేర్కొంది.(ఇది చదవండి: ఈ రెండు సెట్టింగ్స్ మారిస్తే మీ వాట్సప్ ఖాతా మరింత సురక్షితం!)

బహుశా ఇలాంటి సందేశం మీకు కూడా వాట్సాప్‌ గ్రూప్‌లోనో, వ్యక్తిగతంగానో ఇప్పటికే వచ్చి ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వాట్సాప్ సందేశం ఇది. ఒకవేల కనుక మీకు ఇటువంటి మెసేజ్ లతో పాటు ఎటువంటి లింకు రాకపోతే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే, ఇది ఒక నఖిలి మెసేజ్. దీన్ని క్లిక్ చేసిన వారంతా సైబర్‌ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఇదేకాకుండా ఓ యువతి మాట్లాడుతున్న ఆడియో కూడా ఒకటి వాట్సాప్‌ గ్రూపుల్లో కొద్దిరోజులుగా విపరీతంగా సర్య్కులేట్‌ అవుతోంది. ఈ ఆడియోలో” ఇప్పుడు వాట్సాప్ గురుంచి ఏదో చెప్పుతున్నారుగా వాట్సాప్ పని చేయదు అది ఇది అని. అలాకాకుండా వేరే కంపెనీ వాళ్ళు వాట్సాప్ ను కొనుకున్నారు. వాళ్లు ఏమి చెప్పారంటే మన వాట్సాప్ లో ఉన్న20 కాంటాక్ట్ లకు ఈ సందేశాన్ని పంపితే మీకు వాట్సాప్ లోగో మారుతుంది. ఒకవేళ కనుక మారకపోతే వాట్సాప్ కి నెలకు 500 కట్టి వాడుకోవాలి” అని యువతి పేర్కొంది.(ఇది చదవండి: వాట్సాప్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన కేంద్రం)

తొలుత ఈ వరుణ్‌ పులియాని గురించి చెప్పుకోవాలి. నేను వాట్సాప్ డైరెక్టర్ ని అని చెప్పుకునే పేరుతో వాట్సాప్ సంస్థలో ఎవరు లేరు. ఈ పేరు ఎప్పట్నుంచో చలామణీ అవుతోంది. వాట్సాప్ కంపెనీ వెబ్సైట్ లో ఆ పేరుతో ఎవరు లేరు. అందుకే మనం ముఖ్యంగా గమనించాల్సింది వాట్సాప్ ప్రైవసీ పేరుతో వచ్చిన ఎటువంటి మెసేజ్ లు ఎక్కువ శాతం నకిలివి. అందుకని మనం వీటి విషయంలో జర జాగ్రత్తగా ఉండాలి.

మొత్తం వ్యాసం చదవడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.