ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ రోజురోజుకూ కొత్త అప్‌డేషన్స్‌ను యూజర్లకు అందిస్తోంది. యూజర్లకు మరోసారి అద్భుతమైన ఫీచర్ రిలీజ్ చేసింది. అడ్వాన్స్‌డ్ సెర్చ్ ఫీచర్‌ను అందిస్తోంది వాట్సప్. మనం సాదారణంగా కంప్యూటర్‌లో అయినా, స్మార్ట్‌ఫోన్‌లో అయినా ఫైల్స్ వెతకాలంటే సెర్చ్ ఆప్షన్ ఉపయోగిస్తాం దీని కోసం వాట్సప్‌లో కూడా సెర్చ్ ఆప్షన్ ఉంది. అయితే ఈ సెర్చ్ ఆప్షన్‌ని మరింత అడ్వాన్స్‌డ్‌గా మార్చింది వాట్సప్. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ మెసేజెస్, ఫోటోలు డాక్యుమెంట్స్, ఆడియో, వీడియో ఫైల్స్ సులువుగా సెర్చ్ చేయొచ్చు.(చదవండి: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు జాగ్రత్త!)
మనం వాట్సప్‌లో సెర్చ్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఫైల్‌కు సంబంధించిన పదాన్ని లేదా కీవర్డ్‌ని టైప్ చేయాలి. ఒకవేళ అదే ఫైల్ పేరుతో ఎక్కువ ఫైల్స్ ఉంటే మీకు ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీరు ఆధార్ కార్డ్(Aadhar Card) కోసం అని టైప్ చేస్తే. ఆ పేరుతో ఇతర ఫైల్స్, మెసేజెస్ ఉన్నా అన్నీ కనిపిస్తాయి. కానీ మీకు కేవలం ఆ డాక్యుమెంట్ మాత్రమే కావాలనుకుంటే ఫిల్టర్‌లో డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేస్తే చాలు. మీ ఆధార్ కార్డ్ కు సంబదించిన డాక్యుమెంట్ తప్ప ఇతర ఫైల్స్ కనిపించవు. ఫోటోలు, వీడియోలు, లింక్స్, గిఫ్స్, ఆడియో, డాక్యుమెంట్స్‌కు ఇలాగే ఫిల్టర్స్ ఉపయోగించి మీకు కావాల్సిన ఫైల్స్ సులువుగా వెతకొచ్చు. అడ్వాన్స్‌డ్ సెర్చ్ ఫీచర్ వల్ల వాట్సప్‌లోని ఫైల్స్ సులువుగా, వేగంగా సెర్చ్ చేసే అవకాశం లభిస్తుంది యూజర్లకు. ఇక వాట్సప్ ఇటీవల మరిన్ని ఫీచర్స్ రిలీజ్ చేసింది. ఒకే వాట్సప్ అకౌంట్‌తో నాలుగు డివైజ్‌లలో లాగిన్ కావొచ్చు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.