వాట్సాప్ ఇటీవలి కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ నిబందనలపై స్పష్టత ఇచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన నిబందనలు స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిన ప్రైవేట్ మెసేజ్ ల ప్రైవసీని ఏ విధంగానూ ప్రభావితం చేయలేదని పేర్కొంది. “మీ ప్రైవేట్ సందేశాలకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ గతంలో మాదిరిగానే కొనసాగుతుందని” వాట్సాప్ పేర్కొంది. ఈ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్న ప్రైవేట్ మెసేజ్ లను చూడలేమని, కాల్స్ వినలేమని తెలిపింది. వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ తన వినియోగదారుల సందేశాలను, కాల్‌లను కూడా చదవలేదనే విషయాన్ని నొక్కి చెప్పింది. కొద్ది రోజుల క్రితం తీసుకొచ్చిన ప్రైవసీ నిబందనలపై వాట్సాప్‌కు వ్యతిరేకంగా ప్రజల విమర్శల చేస్తున్న సంగతి మనకు తెలిసందే.

ఇంకా చదవండి: వాట్సాప్ మాకొద్దు.. టెలిగ్రామ్, సిగ్నల్ వైపు యూజర్ల చూపు.. ?

ప్రైవసీ పాలసీ నిబందనలపై వినియోగదారుల సమస్యలను పరిష్కరిస్తూ, వాట్సాప్ తన సైట్‌లో కొత్త FAQ పేజీని విడుదల చేసింది. ఇది యాప్ లో ప్రైవేట్ కమ్యూనికేషన్‌ను హైలైట్ చేస్తుంది. “వాట్సాప్ లేదా ఫేస్‌బుక్ మీ సందేశాలను చదవలేవు. మీ స్నేహితులు, కుటుంబం మరియు సహోద్యోగుల వాట్సాప్‌ కాల్స్ కూడా ఎవరు వినలేరు. మీరు ఏది పంచుకున్నా అది మీ మధ్య ఉంటుంది ”అని వాట్సాప్ తెలిపింది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.