వాట్సప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకోస్తూ ఉంటుంది. తాజాగా మరో మంచి ఫీచర్ ని తీసుకొచ్చింది. మనకు ఏదైనా వాట్సప్ చాట్ నుండి మెసేజ్ వస్తే ఒక నోటిఫికేషన్ ఆటోమెటిక్ గా వస్తుంది. ఇప్పుడు నూతన నోటిఫికేషన్లను పొందడానికి యూజర్లను అనుమతించే కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తోంది. అంటే మనకు కావాలంటే నోటిఫికేషన్ ను ఎనేబల్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌తో వినియోగదారులు యాప్ తెరిచినప్పుడు రెండు వేర్వేరు పద్ధతుల్లో అలర్ట్స్ లేదా ఇతర నోటిఫికేషన్‌లు పొందుతారు. ప్రస్తుతం ఇన్-యాప్ నోటిఫికేషన్ ఫీచర్ ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.(చదవండి: ఈ యాప్స్ ని వెంటనే డీలిట్ చేయండి)

ఇన్-యాప్ నోటిఫికేషన్ ఫీచర్ ను మనం ఏ విదంగా సెట్ చేసుకోవాలంటే వాట్సప్ లో సెట్టింగులు> నోటిఫికేషన్లు> ఓపెన్ చేయాలి. అక్కడ మీకు ఇన్-యాప్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మొత్తం మూడు అలర్ట్ స్టైల్ లను పొందవచ్చు. అందులో None, Banners, Alerts అనే 3 అలర్ట్ స్టైల్స్ ఉంటాయి. మీరు కనుక None అనే ఆప్షన్ ఎంచుకుంటే మీకు వాట్సప్ నుండి ఎటువంటి మెసేజ్ లు రావు. అదే Banner ఎంచుకుంటే మీ వాట్సాప్‌కు వచ్చే మెసేజెస్ స్క్రీన్ పైభాగంలో నోటిఫికేషన్ల రూపంలో పొందవచ్చు. కాగా, ఈ నోటిఫికేషన్లు ఆటోమెటిక్‌గా వెళ్లిపోతాయని వాట్సాప్ వివరించింది. ఈ రెండు కాకుండా మీరు అలర్ట్స్ ఆప్షన్‌ను ఎంచుకుంటే నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రావడంతో పాటు అక్కడికక్కడే మెసేజ్ చేసే అవకాశం లభిస్తుంది. నన్ లేదా ఏదీకాదు ఆప్షన్ తప్ప మిగతా రెండు ఆప్షన్లలో దేన్ని ఎంపిక చేసుకున్నా సరే, వారు సౌండ్, వైబ్రేట్ ఆప్షన్లను పొందవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రానున్నట్లు సమాచారం.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here