ఒకప్పుడు ఎవరికైనా నూతన సంవత్సర శుభాకాంక్షలు గ్రీటింగ్స్ ద్వారా తెలియజేసే వాళ్లం. రాను రాను ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో మెసేజె రూపంలో షేర్ చేసుకునే వాళ్లం. ఇప్పుడు తక్కువ ధరకే ఇంటర్నెట్ లభ్యం కావడంతో ఫోటోలు, వీడియో కాల్స్ రూపంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈ కొత్త ఏడాదిలో ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ ద్వారా అత్యధిక సంఖ్యలో వీడియో కాల్స్, మెసేజ్ లు పంపినట్లు ఫేస్‌బుక్ తెలిపింది.

ఇంకా చదవండి: 2021లో ఈ ఫోన్‌లలో నిలిచిపోనున్న వాట్సాప్ సేవలు

ఫేస్‌బుక్ నూతన సంవత్సరంలో జరిగిన వేడుకలు, వీడియో కాల్స్, మెసేజ్ లకు సంబందించిన గణాంకాలను వెల్లడించింది. న్యూ ఇయర్‌ రోజు ఏకంగా 140 కోట్ల వాయిస్‌, వీడియో కాల్స్‌తో వాట్సాప్ సంచలనం సృష్టించింది. దీంతో ఒకే రోజున అత్యధిక సంఖ్యలో యూజర్లు కాల్స్ చేయడంతో వాట్సప్ కొత్త రికార్డు సృష్టించినట్లు ఫేస్‌బుక్ పేర్కొంది. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది వాట్సాప్ కాల్స్ సంఖ్య 50% పెరిగినట్లు పేర్కొంది. అలాగే మెసెంజర్ వీడియో కాల్స్, గ్రూప్ వీడియో కాల్స్ కూడా పెరిగినట్లు తెలిపింది. న్యూ ఇయర్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో 55 మిలియన్ల మంది లైవ్ స్ట్రీమింగ్ చేశారని ఫేస్‌బుక్‌ తెలిపింది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.