ఫేస్‌బుక్ యొక్క ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సప్ వినియోగదారుల భద్రతపై ఫేస్ బుక్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే భద్రత గోప్య పరంగా ప్రభుత్వాల నుండి విమర్శలు ఎదుర్కొంటుంది. స్టాకర్వేర్(Stalkerware)వంటి యాప్స్ ద్వారా వాట్సాప్ వినియోగదారుల యాక్టివిటీని తెలుసుకోగలవనే వార్త తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీటి ద్వారా యూజర్ల డేటాని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాయి. ఈ స్టాకర్వేర్ యాప్‌లు వాట్సాప్‌లోని ఆన్‌లైన్ సిగ్నలింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకుంటున్నాయి. తద్వారా వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా అనే వివరాలు తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో ఇటువంటి ఉచిత యాప్స్ అందుబాటులో ఉన్నాయని బిజినెస్ ఇన్‌సైడర్‌లో ఇటీవలి నివేదిక తెలిపింది. ట్రాకింగ్ ద్వారా వాట్సాప్ ఛాట్ లిస్టును, ఇతర కంటెంట్ లను ఇతరులు యాక్సెస్ చేసే అవకాశం మాత్రం లేదని తెలుస్తోంది. వాట్సాప్‌లో ఉన్న ఎన్స్క్రిప్షన్ ఆప్షన్ దీన్ని అడ్డుకోవడమే ఇందుకు కారణం.(చదవండి: మార్కెట్ లోకి రెండు పవర్ బ్యాంక్ లను విడుదల చేసిన షావోమి)

కమర్షియల్ స్పైవేర్ల జాబితాలోకే స్టాకర్వేర్ యాప్‌లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ట్రాకింగ్ యాప్లతో మంచి ప్రయోజనం ఒక్కటీ ఉండదని ఎలక్ట్రానిక్ ఫ్రాన్షియర్ ఫౌండరియన్ (ఇఎఫ్ఎఫ్) లోని ఒక సీనియర్ సెక్యూరిటీ పరిశోధకుడు చెబుతున్నారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో డజన్ల కొద్దీ ట్రాకింగ్ యాప్ లు ఉన్నాయి. మొబైల్‌ట్రాకర్, ఫోన్‌మోనిటర్, స్పైరా, స్పైబబుల్, స్పైజీ, ఆండ్రాయిడ్ స్పై, మరియు మొబిస్టెల్త్ వంటి యాప్స్ స్టాకర్‌వేర్ వాటికి ఉదాహరణలు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.