ప్రపంచంలో అత్యంత ప్రజా ఆదరణ పొందిన మెసేజింగ్ యాప్ లో వాట్సప్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది వినియోగదారులు వాట్సప్ యాప్ ని ఉపయోగిస్తునారు. అయితే తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకోస్తూనే ఉంటుంది. ఈ మద్య లైవ్ వాల్ పేపర్, పేమెంట్స్ వంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా వాట్సప్ వినియవగదారులు ఎంతగానే ఎదురుచూస్తున్న మరో సరికొత్త ఫీచర్ ని తీసుకోస్తూ ఉంది. తన వెబ్ వెర్షన్ వినియోగదారుల కోసం వీడియో కాలింగ్, వాయిస్ కాలింగ్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకోస్తూ ఉంది.
ఇంకా చదవండి: గూగుల్ సేవల్లో అంతరాయానికి కారణం ఇదే!

“మా వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొని వస్తున్నాం. వాట్సప్ వెబ్ యూజర్ల కోసం వాయిస్, వీడియో కాల్ ఫీచర్స్ ను రూపొందిస్తోంది. కానీ ఇది బీటా ఫీచర్ కావడంతో ఇది కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉంది. అయితే మీరు చింతించకండి. దశల వారీగా ఈ ఫీచర్ ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ప్రస్తుతం వాట్సాప్ డెస్క్‌టాప్‌కు అధిక ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఈ ఫీచర్” ని తీసుకొస్తున్నాం అని వాట్సప్ తన అధికారిక బ్లాగ్ లో ప్రకటించింది.
రాబోయే కొత్త ఫీచర్స్ గురుంచి వాట్సప్ తన బ్లాగ్ లో స్క్రీన్ షాట్స్ షేర్ చేసింది. దీని ప్రకారం, వినియోగదారులు ఇతరుల నుండి వీడియో కాల్, వాయిస్ కాల్ అందుకున్నప్పుడు ఒక పాపప్ వస్తుందని తెలిపింది. ఈ పాపప్ లో మీరు కాల్ ని రిజెక్ట్, ఆక్సెప్ట్ చేయవచ్చు. అలాగే, మీరు ఎవరికైన కాల్ చేయాలని అనుకున్నప్పుడు మీకు పాప్ వస్తుందని, దానిలో మ్యూట్, రిజెక్ట్ వంటి ఆప్షన్ లు కూడా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ మొబైలు వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.
[…] ఇంకా చదవండి: వాట్సప్ లో మరో సరికొత్త ఫీచర్ […]