ఫేస్బుక్ ఆధ్వర్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తుంది. తాజాగా, మరో కీలక ఫీచర్ ని తీసుకొచ్చింది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వాట్సప్ లో చాలా నోటిఫికేషన్ లు వస్తూనే ఉంటాయి. పోనీ ఇలా వచ్చిన నోటిఫికేషన్ లలో చాలా వరకు మనకు అవసరం లేనివి ఉంటాయి. సాధారణంగా వాటిలో చాలా వరకు గుడ్ మార్నింగ్, బర్త్‌డే విషెస్, వైరల్ వీడియోల వంటివే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి మెసేజ్ లను చూసినప్పుడు వీటి నుంచి తప్పించుకునేందుకు ఒక ఆప్షన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అయితే, వాట్సప్ వీటిని నుండి విముక్తి కోసం సరికొత్త ఫీచర్ ని తన యూజర్ల కోసం తీసుకొచ్చింది.
ఇప్పుడు నోటిఫికేషన్స్ ను పూర్తిగా mute చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇంతక ముందు 8 గంటలు, ఒక వారం, ఒక ఏడాదిగా ఉన్న మ్యూట్ ఆప్షన్లలో ‘ఆల్వేస్’ను చేర్చింది. ఒక ఏడాది స్థానంలో దీన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మనం ప్రజలు ఆ ఇబ్బందికరమైన వాట్సప్ గ్రూప్ ల నుంచి ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఉండటానికి సహాయపడుతుంది. దీన్ని మ్యూట్ చేస్తే గ్రూప్ ల నుండి నోటిఫికేషన్ రాదు, అలాగే మనకు అవసరమైతే ఆన్ మ్యూట్ సదుపాయం కూడా ఉంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.