BattleGround Mobile India: పబ్‌జీ.. ఈ గేమ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పబ్‌జీ అంటే చాలు చిన్నారులు నుంచి యువకుల వరకు పడి చస్తారు. ఈ ఆటకు బానిసై అయిన వారు కూడా ఎందరో ఉన్నారు. అయితే ఇంతలా క్రేజ్ ఉన్న చైనా గేమ్ ను గత ఏడాది(2020) సెప్టెంబర్ 2న భారత ప్రభుత్వం దేశ భద్రత కారణాల రీత్యా నిషేధించింది. కేవలం పబ్‌జీని మాత్రమే కాదు చైనాకు చెందిన 200 పైగా యాప్ ల మీద కేంద్రం వేటు వేసింది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య అనేక మంది పబ్‌జీ ప్రియులను నిరాశకు గురి చేసింది.
మళ్లీ దేశంలోకి పబ్‌జీ ఎప్పుుడెప్పుడు వస్తుందా? అని వారంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పబ్‌జీ సంస్థ కూడా తాము మళ్లీ ఇండియాలో వస్తామంటూ సంకేతాలను ఇస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా పబ్‌జీ మాతృ సంస్థ పేరును ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’గా మార్చుతూ కొత్త పోస్టర‍్లను విడుదల చేసింది. ఈ నూతన పోస్టర్లను పబ్‌జీ సంస్థ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేసింది. దీంతో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అనే కొత్త పేరుతో మళ్లీ ఈ గేమ్ భారత్ లోకి తిరిగి వస్తుందంటూ ప్రచారం జోరుగా కోనసాగుతోంది.

అటు సంస్థ కూడా భారత దేశంలో తిరిగి తమ గేమ్ ను పునఃప్రారంభించేందుకు నియామకాలను సైతం చేపట్టింది. కొద్దీ రోజుల క్రితమే గవర్నమెంట్ రిలేషన్ మేనేజర్ పోస్ట్‌కు సంస్థ రిక్రూట్ మెంట్ నిర్వహించింది. అలాగే, పీఎం కేర్స్‌కు పబ్‌జీ సంస్థ రూ.1.5 కోట్లు విరాళాన్ని ప్రకటించింది. మళ్లీ తమ గేమ్ తిరిగిరానున్న నేపథ్యంలో గేమింగ్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.