ఆపిల్ యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ ఐఫోన్ ని తీసుకొస్తునట్లు సమాచారం. ఇది డిజైన్ పరంగా శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్, శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5జీ మాదిరిగానే ఉండవచ్చు అని ఇటీవలి లీక్ వెల్లడించింది. దీనిని 2022 లేదా 2023లో మార్కెట్ లోకి తీసుకురానునట్లు సమాచారం. ఫోల్డబుల్ ఐఫోన్ గురుంచి యూట్యూబర్ జోన్ ప్రాసెసర్ మాట్లాడుతూ.. ఆపిల్ ప్రస్తుతం ఫోల్డబుల్ ఐఫోన్ ని అభివృద్ధి చేస్తుంది. దీనిని చైనాలోని షెన్జెన్లోని కర్మాగారంలో భవిష్యత్ ఫ్లిప్ ఐఫోన్ యొక్క బయటి షెల్‌ను పరీక్షిస్తోంది అని అన్నారు.
ఇంకా చదవండి: 2021 నుండి ఈ స్మార్ట్ఫోన్లలో నిలిచిపోనున్న వాట్సప్ సేవలు
శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ల మాదిరిగానే దీని యొక్క బాహ్య ప్యానెల్లో చిన్న స్క్రీన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఆపిల్ ఈ మొబైల్ వచ్చే ఏడాది చివరిలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ప్రాసెసర్ నిర్దారించారు. ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్ లో సమస్యలను అధిరోహించడానికి తీవ్రంగా కృషి చేస్తునట్లు తెలుస్తుంది. ఈ మొబైల్ 5జీ కూడా సపోర్ట్ చేయనునట్ల పేర్కొన్నారు. ఈ విషయంపై ఆపిల్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.