భారత్ లో ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీపావళి పండుగ సందర్బంగా వినియోగదార్లకు మంచి ఒక ఆఫర్ ని ప్రకటించింది. ఐఫోన్ 11 కొనేవారికి ఉచితంగా ఎయిర్ పాడ్స్‌ను పొందవచ్చు తెలిపింది. ఈ ఎయిర్‌పాడ్స్ ప్రారంభ ధర రూ. 14,900. ఈ దీపావళి ఆఫర్ అనేది యాపిల్ ఆన్లైన్ స్టోర్ లో 2020 అక్టోబర్ 17న ప్రారంభం కానుంది.ఎవరైతే ఈ స్టోర్ ద్వారా ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ కొన్నవారందరూ ఉచితంగా రూ.14,900 విలువైన ఎయిర్‌పాడ్స్ పొందొచ్చు అని తెలిపింది.
ఐఫోన్ 11 గత ఏడాది ప్రారంభమైంది. ఈ ఫోన్ ధర ప్రస్తుతం ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో 64 జీబీ వేరియంట్‌కు ధర రూ.68,300 కాగా 128జీబీ వేరియంట్ ధర రూ.73,600. ఇక 256జీబీ వేరియంట్ ధర రూ.84,100. ఈ మూడు మోడల్స్‌లో ఏది కొన్నా ఎయిర్‌పాడ్స్ ఉచితం అని పేర్కొంది. ఇండియాలో ఎయిర్‌పాడ్స్ ధర చూస్తే రూ.14,900 నుంచి ప్రారంభమవుతుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ కేస్‌తో ధర రూ.18,900. ఒకవేళ ఎయిర్‌పాడ్స్ ప్రో కొనాలంటే రూ.24,900 చెల్లించాలి అని తెలిపింది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.