సినిమాల్లో ప్రత్యేక సన్నివేశాల్లో ఐఫోన్‌ల వాడటం మీరు గమనించి ఉంటారు. కానీ సినిమాలోని విలన్లు ఎప్పుడైన ఐఫోన్‌లను వాడటం మీరు గమనించారా?. నాకు తెలిసి మీరు ఎక్కడి గమనించి ఉండరు ఎందుకో తెలుసా?. సినిమాల్లో కనిపించే నెగెటివ్ పాత్ర చేసే విలన్లు ఐఫోన్‌లను ఉపయోగించరాదని చిత్ర నిర్మాతలకు ఆపిల్ కఠినమైన నిబంధన విధించింది. అసలు ఇటువంటి నిబందన ఒకటి ఉందని మనకు ఇంతవరకు తెలియదు.

అయితే, ఈ విషయం గురుంచి చెప్పిందీ మరెవరో కాదు ప్రముఖ హాలీవుడ్ సినిమా ‘నైవ్స్ అవుట్’ దర్శకుడు రియాన్ జాన్సన్ తెలిపారు. రియాన్ జాన్సన్ వానిటీ ఫెయిర్‌ మెగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ఇతను నైవ్స్ అవుట్ సినిమాలోని ఒక సన్నివేశం గురించి మాట్లాడుతూ.. ఆపిల్ సంస్థ ఐఫోన్‌లను సినిమాలలో ఇతర సన్నివేశాలలో ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. కానీ, కెమెరాలో కనిపించే విలన్ల చేతులలో ఎప్పుడూ ఐఫోన్‌లు వాడకూడదని నిబందన విధించింది అని పేర్కొన్నారు. అయితే జాన్సన్ ఆపిల్‌తో జరిగిన ఒప్పందం పూర్తి వివరాలను వివరించలేదు. ఆపిల్ ఇతర చిత్రనిర్మాతలతో కూడా ఇలాంటి నిబందనలను విధిస్తుందని రియాన్ జాన్సన్ తెలిపాడు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here