గూగుల్ పే యాప్ ఆపిల్ యొక్క యాప్ స్టోర్ నుండి తొలగించబడింది. డిజిటల్ చెల్లింపులు జరిపే ప్రముఖ యాప్స్ లలో గూగుల్ పే ఒకటి. ఆపిల్ యాప్ స్టోర్ నుండి యాప్ తీసివేయబడినప్పటికీ, గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రం తొలిగించబడలేదు. వినియోగదారులు ఇలాంటి సమస్యను ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు. కొన్ని వారాల క్రితం, ఇదే యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలిగించబడింది ఆ సమయంలో చాలా మంది వినియోగదారులు దీని గురించి ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. యాప్ లో ఉన్నా చిన్న లోపం కారణంగా దీనిని తొలిగించినట్లు తెలిపింది. మళ్ళీ లోపంను గుర్తించి పరిష్కరించిన తర్వాత మళ్ళీ గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు, అదే సమస్యతో ఆపిల్ యొక్క యాప్ స్టోర్ నుండి తొలిగించినట్లు మళ్ళీ లోపంను పరిష్కరించిన తర్వాత తీసుకురానునట్లు గూగుల్ ప్రతినిధి తెలిపారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.