టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఆపిల్ వినియోగదారుల కోసం తన సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త అప్డేట్ iOS 14 ను ఐఫోన్ వినియోగదారులకు సెప్టెంబర్ 16 న రాత్రి 10:30 నుండి అందుబాటులో ఉంచింది.

ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అప్డేట్ లో పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌తో సహా అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి, గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ గత సంవత్సరం నుండి ఈ ఫీచర్ లను దాని వినియోగదారులకు అందిస్తోంది. IOS 14 ఐఫోన్ వినియోగదారుల కోసం మెరుగైన గోప్యత(Security)ని కూడా మెరుగుపరిచింది. iOS 14 అప్డేట్ లో మెరుగైన SMS స్పామ్ ఫిల్టరింగ్, కొత్త ఫాంట్‌లు, కొత్త iMessage ఎఫ్ఫెక్ట్స్ మరియు మరెన్నో భారతీయ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన iOS యొక్క ఫీచర్ లు ఈ క్రింది విదంగా ఉన్నాయి.(చదవండి: మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి 5 చిట్కాలు)

iMessage ఎఫ్ఫెక్ట్స్

IMS 14 కోసం iMessages కోసం కీవర్డ్ ఫీచర్‌ను అప్‌గ్రేడ్ చేస్తుంది, ఇక్కడ పుట్టినరోజు శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు వంటి కొన్ని కీలక పదాలను పంపడం కోసం యాప్స్ లో పూర్తి-స్క్రీన్ లో చూపుతుంది. ఇప్పుడు ఈ ఫీచర్ ను స్థానిక భారతీయ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఇంగ్లీషులో లేదా హిందీలో ఎవరికైనా హ్యాపీ దీపావళి లేదా హ్యాపీ హోలీ శుభాకాంక్షలు తెలిపినప్పుడు మీరు అనుభవాన్ని పొందుతారు.  

SMS స్పామ్ ఫిల్టరింగ్

స్పామ్ SMSలు అనేవి ప్రతి ఒక్కరినీ చికాకుపెడుతాయి మరియు iOS 14 ఈ స్పామ్ లను రాకుండా కొద్దిగా సులభతరం చేసింది. స్పామ్ SMS ను ఫిల్టర్ చేయడానికి అనేక యాప్స్ ఉన్నాయి, కానీ iOS 14 లో, ఆపిల్ iMessages యాప్స్ లో అదనపు ఫిల్టర్లను జోడించింది. ఇప్పుడు మీరు ఎగువ ఎడమ వైపున ఉన్న ఫిల్టర్లు బటన్‌ను నొక్కితే, మీకు తెలిసిన పంపినవారు, తెలియని పంపినవారు, లావాదేవీ సందేశాలు మొదలైనవి మీకు కనిపిస్తాయి.

న్యూ ఇండియా- స్పెసిఫిక్ ఫాంట్‌లు

iOS 14లో వచ్చిన ఫాంట్‌లు అనేవి 20 కొత్త డాక్యుమెంట్ ఫాంట్లకు సపోర్ట్ చేస్తుంది మరియు ఇప్పటికే ఉన్న కొన్ని భారతీయ ఫాంట్లకు బోల్డ్ మరియు ఇటాలిక్స్ వంటివి జత చేశారు.

దేవనాగరి ఇమెయిల్ ఐడిలు

దేవనాగరిలో ఇమెయిల్ ఐడి ఉన్న ఎవరైనా మీకు తెలిస్తే, మీరు ఇప్పుడు వారికి మెయిల్ యాప్ ద్వారా ఇమెయిల్ పంపవచ్చు. ఈ యాప్స్ ఇప్పుడు చైనీస్, జపనీస్, కొరియన్, రష్యన్ మరియు థాయ్ భాషలలోఉన్నా మెయిల్ కే కాకుండా దేవనాగరి ఇమెయిల్ ఐడిలకు సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్ అప్డేట్ డౌన్‌లోడ్

ఈ అప్డేట్ లో వచ్చిన ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మన ఆపిల్ కు వచ్చిన సాఫ్ట్‌వేర్ అప్డేట్ లను ఇప్పుడు మొబైల్ డాటా నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. భారత్ లో చాలా మంది ఐపోన్ వినియోగదారులు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్ నెట్ కంటే మొబైల్ డేటా ను ఎక్కువ వినియోగిస్తున్నారని గుర్తించి ఈ అప్డేట్ ను తీసుకొచ్చింది. ఇప్పటి నుండి మొబైల్ డేటాను వాడుకొని సాఫ్ట్‌వేర్ అప్డేట్, సిరి వాయిస్ అప్డేట్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.(చదవండి: మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి 5 చిట్కాలు)

సిరి సౌండ్

iOS 13 సాఫ్ట్‌వేర్ లో సిరి యొక్క ఇండియన్ ఇంగ్లీష్ వాయిస్ రోబోట్ లాగా ఉంటుంది. కానీ, తాజా ఐఓఎస్ 14 అప్‌డేట్‌లో వచ్చిన సిరి భారతీయుడిలా మాట్లాడటాన్ని మీరు వినగలరు. 

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here