టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థకు మరోసారి భారీ దెబ్బ తగిలింది. వినియోగదారులను తప్పు దోవ పట్టించినందుకు ఆపిల్ సంస్థపై ఇటలీకి చెందిన ఆపిల్ డిస్ట్రిబ్యూషన్ ఇంటర్నేషనల్ 12 మిలియన్ డాలర్ల(సుమారు రూ.90 కోట్లు) విధించింది. ఐఫోన్ చెందిన అన్నీ మోడళ్లు వాటర్ రెసిస్టెంట్ అని యూజర్లను తప్పు దోవ పట్టించినందుకు గాను ఈ జరిమాన విధించినట్లు ప్రకటించింది.(చదవండి: బడ్జెట్ లో 5జీ మొబైల్ ని తీసుకొచ్చిన మోటోరోలా)
ఆపిల్ కంపెనీ ఐఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిననప్పుడు ఫోన్లలో వాటర్ రెసిస్టెంట్ ఉందని ప్రకటించింది. కానీ ఏ మొబైల్ లో వాటర్ రెసిస్టెంట్ తీసుకొచ్చారో వివరంగా తెలియజేయలేదు అలాగే కంపెనీ తన డిస్‌క్లైమర్‌లో మాత్రం ద్రవ పదార్దాల ద్వారా మొబైల్ చెడిపోతే ఎటువంటి వారంటీ వర్తించదని పేర్కొంది. ఆదేవిదంగా ఐఫోన్ మోడల్స్ ద్రవాలతో దెబ్బతిన్నప్పుడు వారికి ఎలాంటి సేవలను అందించకపోవడం “దూకుడు వాణిజ్య అభ్యాసం” అని పేర్కొంది. ఉదాహరణకు ఐఫోన్ 8 , ఐఫోన్ 8 ప్లస్ , ఐఫోన్ XR , ఐఫోన్ XS , ఐఫోన్ XS మాక్స్ , ఐఫోన్ 11 , ఐఫోన్ 11pro మరియు ఐఫోన్ 11 ప్రో నమూనాలని తెలిపింది. అందుకే ఆపిల్ డిస్ట్రిబ్యూషన్ ఇంటర్నేషనల్, ఆపిల్ ఇటాలియాపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాంటీట్రస్ట్ అథారిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.