టెలికాం రంగంలో సంచలనాలను సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో కూడా సంచలనాలను తయారు అవుతుంది. రిలయన్స్ జియో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ .5 వేల కన్నా తక్కువకు లాంచ్ చేయాలని యోచిస్తోంది అని, క్రమంగా ధరను రూ .2,500-3,000 కు తగ్గించాలని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం 2జి కనెక్షన్‌ను ఉపయోగించే 20-30 కోట్ల మొబైల్ ఫోన్ వినియోగదారులను కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంటుంది అని ఒక అధికారి తెలిపారు. “జియో స్మార్ట్ ఫోన్ ని 5,000 రూపాయల కన్నా తక్కువకు తీసుకురావాలని కోరుకుంటుంది. చివరకు దీనిని ధర రూ .2,500-3,000 వరకు మార్కెట్ లో విక్రయించాలని అనుకుంటుంది” అని కంపెనీ యొక్క అజ్ఞాత అధికారి చెప్పారు. అయితే దీని గురుంచి జియో నుండి ఎటువంటి అధికార సమాచారం లేదు. కాగా, ప్రస్తుత మార్కెట్ లో 5జీ ఫోన్లు రూ.27,000 నుంచి లభ్యమవుతున్నాయి.(చదవండి: చైనా మొబైల్స్ కు పోటీగా వస్తున్న భారత్ మొబైల్)

43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భారతదేశాన్ని “2 జి-ముక్ట్”గా మార్చాలని నొక్కిచెప్పారు మరియు 350 మిలియన్ల(35 కోట్ల) భారతీయుల ప్రస్తుతం 2 జి ఫీచర్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు అని వీరిని 5G నెట్ వర్క్ కి బదిలీ చేయాలని పేర్కొన్నారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.