మీరు గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం చాలా సులభం. టెక్నాలజీని ఉపయోగించుకొని గ్యాస్ బుకింగ్‌ను సులభతరం చేసింది. ఎల్‌పిజి సిలిండర్ చందాదారులు ఇప్పుడు వాట్సాప్, ఎస్‌ఎంఎస్ ద్వారా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. అలాగే వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా సిలిండర్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.(చదవండి: మీ స్నేహితుల వాట్సప్ స్టేటస్ ని సీక్రెట్ గా చూడండి)

ఇండేన్ ఎల్‌పిజి గ్యాస్ కస్టమర్లందరూ ఇప్పుడు కొత్త నంబర్ 7718955555కు కాల్ చేసి సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో కూడా బుకింగ్ చేయవచ్చు. ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ కోసం బుకింగ్ చేసేటప్పుడు, మీరు చేయాల్సిందల్లా వాట్సాప్ మెసెంజర్‌లో REFILL అని టైప్ చేసి 7588888824కు పంపండి. అయితే, ఇది రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి మాత్రమే బుక్ చేసుకోవాలి. ఇదేవిదంగా హెచ్ పీసీఎల్ వినియోగదారులు కూడా వాట్సప్ నెంబర్ 92222201122 మీ ఫోన్‌లో సేవ్ చేసుకొని వాట్సప్ హెల్ప్‌లైన్ సేవల్ని పొందొచ్చు. గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే BOOK అని పంపాలి. ఇది రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి మాత్రమే బుక్ చేసుకోవాలి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here