మానవ అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా భూమి అవతల మరో గ్రహంపై హెలికాప్టర్ ఎగిరింది. నాసా మార్స్‌పైకి పంపిన ఇన్‌జెన్యుటీ మినీ హెలికాప్టర్(NASA’s Ingenuity Helicopter) చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ గాల్లోకి లేచింది. నాసా పర్సవరెన్స్ రోవర్‌తో కలిపి ఇన్‌జెన్యుటీని మార్స్‌పైకి పంపింది. అక్కడ అత్యంత పలుచగా ఉండే వాతావరణంలో హెలికాప్టర్ ఎగరగలదా, భవిష్యత్తులో అక్కడి గాల్లో తిరుగుతూ పరిశోధనలు చేసేందుకు ఏమేం అవసరం అన్న అంశాలను ఇన్‌జెన్యుటేతో పరిశోధించనున్నారు.
కేవలం 18 కిలోల బరువున్న ఈ మినీ హెలికాప్టర్ పది అడుగుల ఎత్తు మేర గాల్లోకి లేచి, 89 సెకన్ష పాటు ప్రయాణించింది. ఈ సందర్భంగా తొలి ఫొటో కూడా తీసింది. గాల్లోకి ఎగురుతుండగా.. కింద పడిన తన నీడను చిత్రీకరించింది. ఇన్‌జెన్యుటీ గాల్లోకి ఎగిరి చక్కర్లు కొట్టడాన్ని పర్సవరెన్స్ రోవర్ వీడియో తీసి భూమికి చేరవేసీంది. ఈ ప్రయోగానికి సంబంధించిన డేటాను 270 మిలియన్ల కిలోమీటర్ల నుంచి ట్రాన్స్‌మిట్ చేయడం కోసం సుమారు మూడు గంటల సమయం పట్టిందని నాసా పేర్కొంది. నిజానికి ఈ నెల 11నే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నా.. పలు కారణాలతో సోమవారం నిర్వహించారు. మానవ చరిత్రలో తొలిసారిగా విమాన ప్రయాణాన్ని సాకారం చేసిన లైట్ బ్రదర్స్ కృషిని గుర్తు చేసుకుంటూ.. ఇన్‌జెన్యుటీ తొలి ప్రయాణానికి ‘రైట్ బ్రదర్స్ మూమెంట్’గా పేరుపెట్టారు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.