COVID-19 కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 34 మిలియన్లకు పైగా కేసులతో కరోనా వైరస్ విజృంబిస్తుంది, ఈ సమయంలో టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన గూగుల్ మ్యాప్స్ లో కరోనా వైరస్ కోసం కొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో ఏయే ప్రదేశాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి అనే వివరాలు వినియోగదారులకు తెలిసేలా కొత్త ఫీచర్ ని అభివృద్ధి చేసింది. ఇది వినియోగదారులకు నిర్దిష్ట ప్రాంతానికి వెళ్లాలా వద్దా అనే నిర్ణయాలు తీసుకోవడానికి కరోనా ఫీచర్ సహాయపడుతుంది. 220 దేశాలలో COVID లేయర్ ఫీచర్‌ను ఉపయోగించి వినియోగదారులు సమాచారాన్ని పొందవచ్చు. మీరు ఎంచుకున్న ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందా, తగ్గుతోందా, కేసుల వ్యాప్తి ఎలా ఉందనే పూర్తి వివరాలను గూగుల్ మ్యాప్స్ వినియోగదారులకు అందిస్తుంది.(చదవండి: కరోనా వైరస్ అప్డేట్స్ కోసం గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్)

మ్యాప్స్ లో ‘COVID-19 info’ అనే లేయర్ టూల్ ద్వారా ఈ ఫీచర్ ని వాడుకోవచ్చు. మీ ఫోన్ గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసిన తరువాత స్క్రీన్ కుడి ఎగువ భాగంలో ఉన్న లేయర్ టాబ్‌లో ‘COVID-19 info(కోవిడ్ -19 సమాచారం)’ పై క్లిక్ చేసి వాడుకోవచ్చు. ముందు ఏదైనా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని, కొవిడ్-19 info ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలి. ఆ ప్రాంతంలో గత వారం రోజులుగా ప్రతి లక్ష మందిలో నమోదైన సగటు COVID కేసులను వినియోగదారులకు చూపుతుంది. మీరు చూస్తున్న మ్యాప్ యొక్క ప్రాంతంలో 1,00,000 మందికి ఏడు రోజుల సగటు కొత్త కోవిడ్ కేసులు మరియు కేసులు తగ్గుతున్నాయ లేదా పేరుగుతున్నాయా అని మీకు చూపిస్తుంది. దీని ద్వారా మనం కరోనా తీవ్రత ఎక్కువ ఉన్నా ప్రాంతానికి వెళ్ళాలా వద్దే అనేది నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం ఈ వారానికి 5.8 సగటుతో తగ్గుతున్నాయి, అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో 13.5 సగటుతో తగ్గుతున్నాయి. ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఒక మంచి విషయం.(చదవండి: COVID లేయర్ ఫీచర్ ఎలా పని చేస్తుంది? )

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here