దేశ భద్రతల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2న 118 యాప్ లపై నిషేదం విధించింది. ఈ జాబితాలో పబ్ జీ వంటి ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన పబ్ జీ గేమ్ కూడా ఉంది. ఆ తర్వాత పబ్ జీ యొక్క గేమ్ డౌన్ లోడ్ లు తగ్గిపోవడంతో మళ్ళీ భారత్ లో తిరగి రావడానికి ప్రయత్నాలు చేసింది. అందుకోసమే స్థానికి చట్టాలకు అనుగుణంగా వినియోగదారుల భద్రత కోసం మరింత భద్రత చేపట్టినట్లు తెలిపింది. దీని కోసం మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో భారత్ లోకి తిరిగి రావడానికి మార్గం సుగమం అయింది.(చదవండి: మరో 43 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం)

అందుకోసమే, పబ్ జీ మొబైల్ ఇండియా పేరుతో కొత్త యాప్ ని తీసుకురాబోతుంది. దీనికి సంబందించిన టిజర్ ని కూడా విడుదల చేసింది. తాజాగా కేంద్రం కూడా మళ్ళీ అనుమతిని ఇచ్చింది. అయితే “పబ్ జీ మొబైల్ ఇండియా” గేమ్ ఎప్పుడు భారత్ లో విడుదల అవుతుందో అని గేమింగ్ ప్రియులు ఎదరుచూస్తునారు. పబ్ జీ కార్పొరేషన్ కూడా గేమ్ ని ఘనంగా విడుదల చేయాలని భావిస్తుంది. అయితే, పబ్ జీ విడుదల నిర్వహించే టోర్నీలో గెలిచే వారికి భారీ బహుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.(చదవండి: భారత్ లో హై-స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలు)

తాజాగా భారత పబ్‌జీ ప్రొఫెషనల్ గేమర్ అభిజిత్ అందారే ట్విటర్‌లో ఒక ప్రకటన చేసారు. పబ్‌జీ గేమ్ లాంచ్ రోజు నిర్వహించబోయే టోర్నీలో గెలిచే ప్లేయర్లకు 6 కోట్ల రూపాయలు బహుమతిగా అందించనున్నారని తెలిపారు. ఇక పబ్జీ గేమ్‌ను ఇండియాలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గేమ్‌ను డెవలప్ చేస్తున్న టైర్–1 డెవలపర్లకు రూ.40వేల నుంచి రూ.2లక్షల వరకు జీతాలు ఇస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. మరోవైపు, ట్యాప్ గేమ్ షేరింగ్ కమ్యూనిటీలో ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారుల కోసం పబ్ జీ కార్పొరేషన్ తన ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలు పెట్టింది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.