శాంసంగ్ త్వరలో క్వాల్‌కామ్ కు పోటీగా శక్తివంతమైన ప్రాసెసర్ ను తీసుకొస్తునట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు శాంసంగ్ తన మొబైల్ లలో క్వాల్‌కామ్ కు చెందిన ప్రాసెసర్ లతో పాటు సొంతంగా తయారుచేసిన ఎక్సినోస్ ప్రాసెసర్ లను ఉపయోగిస్తూ వచ్చింది. ఇప్పడు తాజాగా మరో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ కు పోటీగా ఎక్సినోస్ 1080 ప్రాసెసర్ లను అభివృద్ది చేసింది. AnTuTu బెంచ్మార్క్ పరీక్షలలో పనితీరు పరంగా స్నాప్‌డ్రాగన్ 865+( 629,245) కంటే ఎక్సినోస్‌ 1080 అత్యధికంగా 650,000 పాయింట్ల స్కోరు మార్కును కూడా అధిగమించిందని టెక్ నిపుణులు పేర్కొన్నారు. శాంసంగ్ గతంలో ఉపయోగించిన ఎక్సినోస్ 980 స్థానంలో ఎక్సినోస్ 1080ని తీసుకొస్తుందట.

అలాగే, శాంసంగ్ క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్‌కు పోటీగా ఎక్సినోస్‌ 2100 ప్రాసెసర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఫీచర్స్‌ పరంగా రెండు ప్రాసెసర్‌లు ఒకే విధంగా ఉంటాయని సమాచారం. Vivo X60లో ఎక్సినోస్ 1080 ప్రాసెసర్ తీసుకురానునట్లు సమాచారం. అయితే శాంసంగ్‌ 2022 నాటికి గ్రాఫిక్‌ అండ్ మల్టీమీడియా ప్రాసెసర్‌తో కలిసి పూర్తిస్థాయిలో సొంత ప్రాసెసర్‌లను తయారుచేయాలని భావిస్తోందట. అంతేకాకుండా వాటిని వాణిజ్యపరంగా ఫోన్ తయారీ కంపెనీలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలుస్తోంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here