యాపిల్ కంపెనీ మార్కెట్ లోకి ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ ని విడుదల చేసినప్పటి నుండి బాక్స్‌లో ఛార్జర్‌, ఇయర్‌ఫోన్స్‌ లేకపోవడంపై చాలా విమర్శలు వచ్చాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శామ్‌సంగ్ సైతం ఏకంగా తన సోషల్‌ మీడియా ఖాతాలో యాపిల్‌ను ట్రోల్‌ చేస్తూ పోస్టులు పెట్టింది. ఇప్పుడు తాజాగా శామ్‌సంగ్ కూడా అదే చేస్తుందని పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడు, రాబోయే గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ఫోన్ లో ఐఫోన్ 12 లైనప్ మాదిరిగానే బాక్స్‌లో ఛార్జర్ లేకుండా తీసుకురావాలని యోచిస్తుంది అని సమాచారం. కొన్ని దక్షిణ కొరియా మీడియా సంస్థలు ఇప్పటికే ఈ విషయమై వార్తలు రాశాయి. గతంలోనూ యాపిల్‌ను పలు సందర్భాల్లో శాంసంగ్‌ విమర్శించింది. నాచ్‌ డిస్‌ప్లేను తీసుకొచ్చినప్పుడు.. 3.5ఎంఎం ఆడియో జాక్‌ను తొలగించినప్పుడు ట్రోల్‌ చేసింది. కానీ కొద్దిరోజులకే శామ్‌సంగ్ కూడా అదే బాటలో పయనించింది. పర్యావరణ హితం కోసమే ఛార్జర్‌, ఇయర్‌ఫోన్స్‌ను తాము తొలగించామని ఐఫోన్‌ 12 విషయంలో యాపిల్‌ చెప్పుకొచ్చింది. మరి శాంసంగ్‌ ఏ సాకు చెబుతుందో చూడాలి మరి!.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.