కరోనా మహమ్మారి కారణంగా 5జీ తీసుకొనిరావడానికి కొంచెం ఆలస్యం అయినప్పటికి మన దేశంలో ఇప్పుడు ప్రజలందరికీ 5జీ అందించడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. మనం ఇప్పటీ వరకు 5జీ ఇంటర్నెట్ యొక్క స్పీడ్ ను పరీక్ష దశలో మాత్రమే గమనించం. కానీ, ఇటీవల దక్షిణ కొరియా ప్రభుత్వం అక్కడ అధికారికంగా ప్రజలకు 2020 ఏప్రిల్ నెలలో 5జీ ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని మూడు ప్రధాన మొబైల్ క్యారియర్‌లైన ఎస్‌కె టెలికాం, కెటి కార్ప్ మరియు ఎల్‌జి అప్లస్ కార్ప్ యొక్క 5జీ హై-స్పీడ్ ఇంటర్ నెట్ నెట్‌వర్క్‌లో సగటు డౌన్‌లోడ్ వేగం మొదటి 6 నెలల కాలంలో ఇంటర్ నెట్ స్పీడ్ కేవలం 30 ఎమ్‌బిపిఎస్ గా ఉంది. 6 నెలల తర్వాత 5జీ ఇంటర్ నెట్ స్పీడ్ పుంజుకొని సెకనుకు 690.47 ఎమ్‌బిపిఎస్’కు చేరుకున్నట్లు సైన్స్ మరియు ఐసిటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇంకా చదవండి: మరో కొత్త రికార్డు సృష్టించిన వాట్సాప్!
దక్షిణ కొరియా ప్రధాన టెలికాం కంపెనీలైన ఎస్కె టెలికాం 5జీ డౌన్‌లోడ్ వేగం 795.57ఎమ్‌బిపిఎస్, కెటి 667.48ఎమ్‌బిపిఎస్, ఎల్‌జి అప్లస్608.49 ఎమ్‌బిపిఎస్ గా ఉంది. అలాగే ఆ దేశంలో ప్రస్తుతం 4జీ ఎల్‌టీఈ సగటు డౌన్‌లోడ్ వేగం 153.1గా ఉంది. అంటే 5జీ సగటు వేగం కంటే నాలుగు రెట్లు తక్కువ అని అర్ధం. 5జీని మొట్టమొదట అధికారికంగా వాణిజ్యీకరించిన దేశం దక్షిణ కొరియానే. అక్టోబర్ చివరి నాటికి దాదాపు 10 మిలియన్ల 5జీ మొబైల్ చందాదారులు ఉన్నారు. దేశంలోని మొత్తం 70 మిలియన్ల మొబైల్ చందాదారుల 5జీ వాటా 14 శాతం.

దక్షిణ కొరియాలో 5జీని ప్రవేశ పెట్టినప్పుడు సాంకేతిక సమస్యలు, తక్కువ ఇంటర్ నెట్ స్పీడ్, పరిమిత నెట్‌వర్క్ కవరేజ్ వంటి సమస్యలను ఎదుర్కొంది. అక్కడి ప్రభుత్వ సహాయంతో ఈ సమస్యల్ని పరిష్కరించడంతో పాటు తక్కువ కాలంలోనే 5జీ 10 మిలియన్ల వినియోగదారులను కలిగినట్లు టెలికాం కంపెనీలు పేర్కొన్నాయి. గత ఏడాదిలో మొదటి అర్ధభాగంతో పోలిస్తే నెట్‌వర్క్ నాణ్యత, ఇంటర్నెట్ వేగం మెరుగుపడిందని తాజా నివేదిక పేర్కొంది. 2022 నాటికి దేశవ్యాప్తంగా 5జీ కవరేజీని అందించాలని దక్షిణ కొరియా లక్ష్యంగా పెట్టుకుంది. మూడు ప్రధాన టెలికాం కంపెనీలు భవిష్యత్ లో నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను మెరుగు పరుచుకోవడానికి మొత్తం 25.7 ట్రిలియన్ డాలర్లను (2.5 లక్షల కోట్ల రూపాయలను) ఖర్చు చేయనున్నట్లు హామీ ఇచ్చాయి.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.