ప్రముఖ సంస్థ తాజ్ హోటల్స్ పేరుతో సైబర్ ‌నేరగాళ్లు డేటా చోరీకి పాల్పడుతున్నారు. సులువైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వాలెంటైన్స్ డే సందర్భంగా ఏడు రోజుల పాటు ఉచితంగా హోటల్ తాజ్ లో బసచేయవచ్చు అనే ఒక వాట్సాప్ మెసేజ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. దింతో పాటు సులువైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఉచితంగా ఎంఐ11టీ ఫోన్‌ గెలుచుకోవచ్చని అమాయకులను ఉచ్చులోకి దింపుతున్నారు. వాట్సాప్ లో వైరల్ అయ్యే ఆ లింకును క్లిక్ చేసిన తర్వాత ఫోన్‌ గెలుచుకున్నారని మెసేజ్‌ వస్తుంది. ఫోన్ పొందాలంటే కొన్ని వ్యక్తిగత సమాచారం ఎంటర్ చేయాలనీ చూపిస్తుంది. ఒకవేల కనుక మీరు మీ వివరాలు సమర్పించినట్లయితే ఇకా అంతే సంగతులు.

అలాగే టాటా ప్రమోషన్‌ మెసేజ్ ను ఐదు వాట్సాప్‌ గ్రూపులు లేదా 20 మంది స్నేహితులకు పంపించాలనే చెప్పడంతో నేరగాళ్లు పంపే లింక్‌ను వీరు ఇతరులకు పంపుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయాన్నీ గమనించిన తాజ్ హోటల్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. “ఒక వెబ్‌సైట్ వాలెంటైన్స్ డే పేరుతొ వాట్సాప్ ద్వారా తాజ్ ఎక్స్‌పీరియన్స్ గిఫ్ట్ కార్డ్‌ను అందిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. తాజ్ హోటల్స్/ఐహెచ్‌సిఎల్ అటువంటి ప్రమోషన్ ఇవ్వలేదని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము. దీన్ని మీరు అర్ధం చేసుకొని మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము” అని తాజ్ హోటల్స్ గ్రూప్ ట్విటర్ లో పేర్కొంది. ఇటువంటి నకిలీ మెసేజ్ లతో జర జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతె మీరు సైబర్ ‌నేరగాళ్లు వలలో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here