2020లో కరోనా మహమ్మారి కారణంగా మొబైల్ వినియోగం భాగా పెరిగింది. ప్రతి చిన్న పనికి మొబైల్ ఫోన్ మీద ఆధారపడుతున్నారు. ఇటీవల 2020లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసిన ఒక నివేదిక బయటకి వచ్చింది. ఈ నివేదిక ప్రకారం 2020లో టిక్‌టాక్ ఫేస్‌బుక్‌ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా నిలిచింది. భారత ప్రభుత్వం నిషేదం విధించినప్పటికి ప్రపంచవ్యాప్తంగా దాని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అనలిటికల్ సంస్థ యాప్ అన్నీ(App Annie) తాజాగా సర్వే రిపోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అంతేగాక 2021లో ప్రపంచవ్యాప్తంగా సగటున 1.2 బిలియన్ల నెలవారీ యాక్టీవ్ యూజర్స్‌ను టిక్‌టాక్ కలిగి ఉంటుందని నివేదిక అంచనా వేసింది.(చదవండి: ప్రమాదంలో 70 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డుదారులు)
ఈ ఏడాది అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన మొదటి 5 యాప్స్ లలో ఫేస్ బుక్ కి చెందిన 3 యాప్స్ ఉన్నాయి. టిక్ టాక్ మొదటిస్థానంలో, ఫేస్‌బుక్ రెండవ స్థానంలో, వాట్సాప్ మెసెంజర్ మూడవ స్థానంలో, వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ నాల్గవ స్థానంలో, ఇన్‌స్టాగ్రామ్ ఐదవ స్థానంలో ఉన్నాయి. జూమ్ యాప్ వినియోగం కరోనా కారణంగా విపరీతంగా పెరగింది. ప్రపంచ వ్యాప్తంగా డౌన్‌లోడ్ చేయబడిన టాప్ 10 అనువర్తనాల జాబితాలో ఫేస్‌బుక్ మెసెంజర్, గూగుల్ మీట్, స్నాప్‌చాట్, టెలిగ్రామ్, లైక్ యాప్స్ ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐఓఎస్ మరియు గూగుల్ ప్లే మొబైల్ యాప్లపై వినియోగదారుల వ్యయం 25 శాతం వృద్ది పెరిగి 2020లో 112 బిలియన్ డాలర్లను వ్యాపారం చేరుకుంది. కోవిడ్–19 (COVID-19) కారణంగా ఈ ఏడాది అందరూ ఇంట్లోకే పరిమితమయ్యారు. తద్వారా మొబైల్ వినియోగం విపరీతంగా పెరిగి యాప్ డౌన్‌లోడ్స్ పెరుగుదల వేగవంతమైందని నివేదిక అభిప్రాయపడింది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.
[…] […]