Apple iPhone SE

సాధారణంగా మనం ఎప్పుడైన ఆన్‌లైన్‌లో ఖరీదైన వస్తువులు ఆర‍్డర్‌ చేస్తే, నకిలీ వస్తువులు లేదా చాలా చీప్ వస్తువులను పంపించి మోసగించిన వార్తలను మనం చదువుతుంటాం. అంతేకాదు లగ్జరీ ఫోన్లకు బదులు, ఇటుకలు, డమ్మీ ఫోన్లు డెలివరీ చేసిన సంఘటనలు చూశాం. అందుకే చాలా మంది ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్‌ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. కానీ, తాజాగా ఇందుకు భిన్నంగా ఒక ఆసక్తి కరమైన ఘటన ఇంగ్లాండ్ లో చోటు చేసుకుంది.

ఆన్‌లైన్‌లో ఆపిల్‌ పళ్లను ఆర్డర్‌ ఇస్తే.. ఏకంగా ఖరీదైన ఆపిల్‌ ఐఫోన్‌ వచ్చింది. విషయం తెలుసుకున్న తర్వాత ఆతని ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ట్వికెన్‌హామ్‌కు చెందిన 50 ఏళ్ల నిక్‌ జేమ్స్ ఈ అరుదైన జాక్‌ పాట్‌ కొట్టేశారు. స్వయంగా అతనే ఈ వివరాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. బ్రిట‌న్‌లో నివసిస్తున్న జేమ్స్ ఆన్‌లైన్‌లో కొన్ని ఆపిల్ పండ్ల కోసం సూపర్ మార్కెట్‌కు ఆర్డ‌ర్ ఇచ్చారు. అయితే ఆ పార్సిల్‌లో పండ్ల‌తో పాటు ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఈ కూడా రావడంతో ఆశ్చర్యపోయాడు.

ఈస్ట‌ర్ సంద‌ర్భంగా ఎవరైన ప్రాంక్ చేశారేమో అనుకుని కొద్దిగా అనుమానించాడు. అయితే తర్వాత టెస్కో మార్కెట్ కంపెనీ ఇచ్చిన స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ అని తెలుసుకుని జేమ్స్‌ను సూపర్‌ థ్రిల్ ఫీల్‌ అయ్యాడు. అసలు విషయం ఏమిటంటే.. టెస్కో గ్రోస‌రీ సంస్థ ప్ర‌మోష‌న‌ల్ క్యాంపేన్‌లో భాగంగా ఆపిల్ పళ్లతో పాటు ఐఫోన్ స్పెష‌ల్ ఎడిష‌న్ ఫోన్‌ను గిఫ్ట్‌గా అతనికి అందించిందన్న మాట. ‘సూపర్ సబ్‌స్టిట్యూట్’లో రెగ్యులర్ అవసరమైన వస్తువులను కొనుగోలు చేసిన వినియోగదారులకు ఆపిల్ ఐఫోన్లు, శామ్ సంగ్ గెలాక్సీ టాబ్లెట్, ఎయిర్‌పాడ్స్‌తో పాటు ఇత‌ర ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను ఊహించని బహుమతులుగా అందిస్తోందట టెస్కో సంస్థ.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here