మీ ఇంట్లో ల్యాండ్‌లైన్ ఉంటే జనవరి 15 నుండి మొబైల్ నంబర్లకు కాల్ చేయడానికి ముందు తప్పనిసరిగా సున్నాను జోడించాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో ల్యాండ్‌లైన్ యూజర్లు మొబైల్ కాల్ కోసం జనవరి 15 నుండి ‘0’ని జోడించి డయల్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మొబైల్ నెంబర్ 10 అంకెలు ఉంటే.. దానికి ముందు మరో అంకె ‘0’ను యాడ్ చేయాల్సి ఉంటుంది. దీనిపై ట్రాయ్) డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం (డిఓటి)కు గత మే లోనే ప్రతిపాదించింది. తాజాగా ట్రాయ్ ప్రతిపాదనను డాట్ అంగీకరించింది. ఒక వేల వినియోగదారుడు ‘0’ని ఉపయోగించకుండా మొబైల్‌కు కాల్ చేసినప్పుడల్లా కాల్ కలవక పోవచ్చు అని తెలిపింది. (చదవండి: విద్యార్థులకు మాతృభాషలోనే ఇంజనీరింగ్ విద్యాబోదన)
ల్యాండ్‌లైన్ వినియోగదారులు సున్నా నెంబర్ తో డయల్ చేయడం గురించి తెలియజేయడానికి ప్రకటన ఇవ్వనున్నట్లు టెలికమ్యూనికేషన్ విభాగం(డిఓటి) తెలిపింది. ఒక వేల ల్యాండ్‌లైన్ వినియోగదారులు ‘0’ని జోడించకుండా మొబైల్ నంబర్‌ను డయల్ చేసినప్పుడల్లా ఈ ప్రకటన వినబడుతుంది. ఇంకో విషయం ఏమిటి అంటే? ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ కి తప్ప మిగతా అన్నీ సేవలు ఎప్పటిలాగే కొనసాగుతాయని పేర్కొంది. ట్రాయ్ మేలో మొబైల్ సంఖ్యల విషయంలో 10-అంకెల నుండి 11-అంకెల నంబరింగ్ మార్చడం వంటి సిఫార్సులు చేసింది. దీని ద్వారా మొత్తం 10 బిలియన్ సంఖ్యల కొత్త మొబైల్ నంబర్లు సృష్టించవచ్చు. డాంగిల్స్ కోసం కేటాయించిన మొబైల్ నంబర్లను 13 అంకెలకు మార్చాలని కూడా సూచించింది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.