యూట్యూబ్ ఇప్పుడు ఈ పేరు తెలియని వారు చాలా కొద్దీ మంది మాత్రమే ఉంటారు. అంతలా ప్రజలను ఆకట్టుకుంటుంది ఈ యూట్యూబ్. కోవిడ్ – 19 కారణంగా వీక్షకుల సంఖ్య చాలా పెరగింది అని చెప్పుకోవాలి. ఒక కంపెనీలో జరిగిన వెడుకను వీడియో రూపంలో తోటి ఉద్యోగులకు షేర్ చేసేందుకు సృష్టించిందే ఈ యూట్యూబ్. పేపాల్ కు చెందిన ముగ్గురు మాజీ ఉద్యోగులు-చాడ్ హర్లీ, స్టీవ్ చెన్, జావేద్ కరీం ఫిబ్రవరి 2005లో యూట్యూబ్ ను సృష్టించారు. దీనిని గూగుల్ 2006 నవంబర్ లో 1.65 బిలియన్ డాలర్ల(12 వేల కోట్ల)కు కొనుగోలు చేసింది. ఇప్పుడు యూట్యూబ్ గూగుల్ అనుబంధ సంస్థలలో ఒకటిగా పనిచేస్తుంది.

ఇంకా చదవండి: నేటి నుండి అమెజాన్ లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 సేల్

యూట్యూబ్ వినియోగదారులకు ఉచితంగానే కంటెంట్ లభించడంతో పాటు, క్రియేటర్ లు కూడా డబ్బులు పొందుతున్నారు. ఇప్పుడు చాలా మంది దీనిని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. అయితే, ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా యూట్యూబ్ ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్న వారి జాబితాను వెల్లడించింది ఫోర్బ్స్. అందులో నుండి టాప్ – 5 పేర్లు మేము మీతో పంచుకుంటున్నాం.

టాప్-5. మార్కిప్లియర్ (మార్క్ ఫిష్బాచ్)
27.8 మిలియన్ల మంది సభ్యులను కలిగి ఉన్న మార్కిప్లియర్ 19.5 మిలియన్ డాలర్లు(144 కోట్లు) సంపాదించారని మరియు 3.1 బిలియన్ వ్యూస్ సంపాదించారని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్కిప్లియర్ ఎనిమిది సంవత్సరాలుగా యూట్యూబర్ గా కొనసాగుతున్నాడు. 144 కోట్ల సంపాదనతో 5వ స్థానంలో నిలిచాడు.

Markiplier (Mark Fischbach)

టాప్-4: రెట్ మరియు లింక్
41.8 మిలియన్ల మంది సభ్యులను కలిగి ఉన్న యూట్యూబ్ రెట్ అండ్ లింక్ 20 మిలియన్ డాలర్లు(147 కోట్ల) సంపాదించాడు. వీరు 147 కోట్ల సంపాదనతో 4వ స్థానంలో నిలిచారు.

Rhett and Link

టాప్-3: డ్యూడ్ పర్ఫెక్ట్
57.5 మిలియన్ల మంది సభ్యులను కలిగి ఉన్న ఫైవ్ మ్యాన్ ఛానల్ డ్యూడ్ పర్ఫెక్ట్ 23 మిలియన్ డాలర్లు(169 కోట్లు) సంపాదించారు. ఈ చానెల్ 5గురు భాగస్వామ్యంతో ఏర్పడింది. కోబీ, కోరీ కాటన్, గారెట్ హిల్బర్ట్, కోడి జోన్స్, టైలర్ టోనీ – డ్యూడ్ పర్ఫెక్ట్ అనే ఐదుగురు స్నేహితులు కలిసి ఈ చానెల్ స్థాపించారు.

Dude Perfect

టాప్ – 2: మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డోనాల్డ్సన్)
ఫోర్బ్స్ ప్రకారం, 47.8 మిలియన్ల మంది సభ్యులను కలిగి ఉన్న మిస్టర్ బీస్ట్ 24 మిలియన్ల డాలర్ల(177 కోట్లు) ను కొల్లగొట్టారు. మిస్టర్ బీస్ట్ అసలు పేరు జిమ్మీ డోనాల్డ్సన్.

MrBeast

టాప్-1: ర్యాన్ కాజీ
తొమ్మిదేళ్ల ర్యాన్ కాజీ ఫోర్బ్స్ యొక్క 2020లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన యూట్యూబ్ స్టార్. జూన్ 2019 మరియు జూన్ 2020 మధ్య 29.5 మిలియన్ డాలర్లు(217 కోట్లు) సంపాదించాడు. కాజీ తన ఛానెల్ ర్యాన్స్ వరల్డ్‌లో బొమ్మలను చేయడం ద్వారా ఇంత మొత్తాన్ని సంపాదించాడు. ఫోర్బ్స్ ప్రకారం… ప్రపంచంలో యూట్యూబ్ ద్వారా అత్యధికంగా సంపాదించినది ఈ చిన్నారే. 41.7 మిలియన్ల మంది సభ్యులను కలిగి ఉన్నాడు.

Ryan Kaji

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here