వాట్సప్ నుంచి రెండు రోజుల క్రితం ఒక అప్డేట్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ అప్డేట్ లో భాగంగా ప్రతి యొక్క వినియోగదారుడు తమ నూతన ప్రైవసీ మరియు పాలసీ నిబందనలను అంగీకరించాలని కోరిన సంగతి మనకు తెలిసిందే. ఒకవేల అంగీకరించకపోతే ఫిబ్రవరి 8 తర్వాత నుంచి తమ వాట్సప్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ప్రైవసీ పాలసీ గురుంచి కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చాలా మంది తమకు ఈ అప్డేట్ రాలేదని, కొందరు వచ్చిన అనుకోకుండా నో ఆప్షన్ క్లిక్ చేసినట్లు పేర్కొంటున్నారు.
ఇంకా చదవండి: కొత్త ఏడాదిలో వాట్సప్ నుంచి సరికొత్త అప్‌డేట్
ప్రైవసీ పాలసీలో అసలు ఏముంది?
మేము వాట్సాప్ సేవలను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు భద్రత, గోప్యతా విషయాలను పటిష్టంగా నిర్మించాలని అనుకుంటున్నాం అని తాజాగా వచ్చిన అప్డేట్ లో సంస్థ పేర్కొంది. అసలు ఈ అప్డేట్ తీసుకురావడానికి ప్రధాన కారణం ఫేస్బుక్ 2014లో వాట్సప్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి గోప్యతా, భద్రత విషయంలో అనేక విమర్శలు వస్తున్నాయి. ఒకానొక దశలో వాట్సప్ సృష్టికర్త జాన్ కౌమ్ తన సీఈఓ పదివికి రాజీనామ చేశారు. ” ప్రస్తుతం వాట్సప్ సంస్థ యూజర్ల డేటాను వాట్సప్ ప్రతి నిమిషం ట్రాక్ చేస్తుంది. ఈ డేటాను భవిష్యత్ లో అమ్మడానికి కానీ ఇతర అవసరాల కోసం ఉపయోగించనున్నట్లు” జాన్ కౌమ్ తెలిపాడు.
వాట్సాప్ యొక్క క్రొత్త ప్రైవసీ పాలసీ కింద ముఖ్యంగా మా సేవాలతో అనుసంధానించబడిన థర్డ్ పార్టీ లేదా ఇతర ఫేస్బుక్ కంపెనీలకు సమాచారాన్ని పంచుకునే అవకాశం భవిష్యత్ లో కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు థర్డ్ పార్టీ ప్లాట్‌ఫాం నుండి కంటెంట్‌ను ప్లే చేయడానికి యాప్ లోని వీడియో ప్లేయర్‌ను వంటివి ఉపయోగించవచ్చు అని తెలిపింది. అందుకే మీ డేటకు సంబందించిన డివైజ్ ఐడి, యూజర్ ఐడి, అడ్వర్టైజింగ్ డేటా, పర్చేస్ హిస్టరీ, మీ లొకేషన్, ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామా, కాంటాక్ట్, ప్రొడక్షన్ ఇంటరాక్షన్, క్రాష్ డేటా, ప్రైవసీ డేటా, పర్ఫార్మన్స్ డేటా, పేమెంట్ ఇన్ఫో, కస్టమర్ సపోర్ట్, ప్రొడక్ట్ ఇంటరాక్షన్, ఇతర యూజర్ కంటెంట్ వంటివి యాక్సెస్ పొందనున్నట్లు తెలిపింది.
ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్ లో వాట్సప్ లో యాడ్స్ కూడా రావచ్చు లేదా యూజర్ డేటాను ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ఇతర థర్డ్ పార్టీ యాప్స్ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఒకవేల మీకు కనుక వాట్సప్ యొక్క కొత్త ప్రైవసీ పాలసీ నిబందనలు నచ్చకపోతే దీనికి బదులుగు ఐమెసేజ్, సిగ్నల్, టేలిగ్రాం వంటి ఇతర యాప్స్ కూడా ట్రై చేయవచ్చు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.