వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. తాజాగా వాట్సాప్‌ బిజినెస్ యాప్‌లో కొత్తగా షాపింగ్‌ బటన్‌ చేర్చారు. ఈ కొత్త సౌకర్యం ద్వారా ఒక సంస్థ యొక్కవస్తువులు, సేవలకు సంబంధించిన వివరాలను ప్రజలు సులభంగా వాట్సాప్‌లో తెలుసుకునేందుకు విలుపడుతుంది. సెప్టెంబరులో, ఫేస్బుక్ యాజమాన్యంలోని సంస్థ షాపింగ్ బటన్‌ను తీసుకురావడం ద్వారా వ్యాపారా సంస్థలు తమ ఉత్పత్తులను మరియు సేవలను వాట్సప్ ద్వారా వినియోగదారులకు సులభంగా తెలుసుకునేందుకు ఇది దోహదపడనుంది. ఈ ఫీచర్ మొదట్లో ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ బీటా వెర్షన్‌లో కనిపించింది. అయితే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ వినియోగదారులకు తీసుకొచ్చారు.

వాట్సాప్‌ బిజినెస్‌ ఖాతాలకు రోజూ 17.5 కోట్ల మంది ప్రజలు సందేశాలు పంపుతున్నారని సంస్థ తెలిపింది. ప్రతి నెలా వ్యాపార క్యాటలాగ్‌లను 4 కోట్ల మందికి పైగా వీక్షిస్తున్నారు. ఇందులో భారతీయులు 30 లక్షలకు పైగానే ఉన్నారు. అందుకే వినియోగదారుల షాపింగ్‌ సౌలభ్యాన్ని సులభతరం చేయాలని భావించామని వాట్సాప్‌ తెలిపింది. వాయిస్‌ కాల్‌ బటన్‌ స్థానంలో కొత్త షాపింగ్‌ బటన్‌ను చేర్చారు. ఇకపై వాయిస్‌ కాల్‌ బటన్‌ కోసం వినియోగదారులు కాల్‌ బటన్‌పై నొక్కి వాయిస్‌ లేదా వీడియో కాల్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here