వాట్సాప్ కొద్ది రోజుల క్రితం కొత్తగా ప్రైవసీ పాలసీ నిబందనలు తెచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కొత్తగా వచ్చిన ప్రైవసీ పాలసీ నిబందనలను అంగీకరించిన యూజర్ల మొబైల్ ఫోన్లలో మాత్రమే వాట్సాప్ పనిచేయనున్నట్లు పేర్కొంది. ఒకవేల అంగీకరించకపోతే వారి ఫోన్లలో ఫిబ్రవరి 8 తర్వాత నుంచి వాట్సాప్ సేవలు నిలిపివేయనునట్లు పేర్కొంది. కొత్తగా తీసుకొచ్చిన నిబందనల ముఖ్య సారాంశం ఏమిటంటే కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం ఫేస్‌బుక్‌ సంబంధిత సర్వీసులతో యూజర్‌‌ వ్యక్తిగత‌ సమాచారం, డివైజ్‌ ఇన్ఫర్మేషన్‌, ఐపీ అడ్రస్‌ తదితర వివరాలు వాట్సాప్‌ పంచుకొనున్నట్లు పేర్కొంది.

ఇంకా చదవండి: టెలిగ్రామ్, సిగ్నల్ వైపు వాట్సాప్ యూజర్ల చూపు.. ?

కొత్త నిబందనలు వారికి మాత్రమే..

అయితే, కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ నిబందనల మీద సోషల్ మీడియాలో చాలా విమర్శలు వస్తున్నాయి. టెస్లా యొక్క ఎలోన్ మస్క్‌తో సహా చాలామంది నిపుణులు ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సూచిస్తున్నారు. దీంతో చాలా మంది యూజర్లు సిగ్నల్, టెలీగ్రాం వంటి ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ లు ఉపయోగిస్తున్నారు. తాజాగా ఈ విమర్శలపై వాట్సాప్ అధినేత విల్ క్యాత్‌కార్ట్ ట్విట్టర్ ద్వారా స్పష్టత ఇచ్చారు. “కొత్తగా తీసుకొచ్చిన నిబందనల ద్వారా యూజర్లకు పారదర్శకతను పెంచేందుకే, బిజినెస్‌ ఫీచర్స్‌ను మరింత మెరుగ్గా యూజర్లకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని” అని క్యాత్‌కార్ట్ పేర్కొన్నారు. కేవలం వాట్సాప్‌ బిజినెస్‌ ఖాతాదారులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఫేస్‌బుక్‌తో షేర్‌ చేసుకుంటామని తెలిపారు. అలానే వాట్సాప్‌ వ్యక్తిగత ఖాతాల వివరాలు వ్యాపార అవసరాలకు అసలు షేర్ చేసుకోమని పేర్కొన్నారు.

ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌ డేటా షేరింగ్‌కు సంబంధించిన ఎలాంటి మార్పులు చేయలేదని క్యాత్‌కార్ట్ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో చాట్ చేసే యూజర్ల వ్యక్తిగత డేటాపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. వ్యక్తిగత చాట్స్‌, కాల్స్‌కు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (ఈ2ఈ) ఉండడం వల్ల ఆ వివరాలను తాము చూడలేమన్నారు. ఈ2ఈ విధానానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. మేము ప్రైవేట్ చాట్ యొక్క విషయంలో చాలా పారదర్శకంగా ఉన్నాం, బిజినెస్‌ ఫీచర్స్‌ను మాత్రమే మరింత మెరుగ్గా తీసుకొచ్చామని పేర్కొన్నాడు. దీని గురించి అక్టోబర్‌లో డేటాను ఎలా ఉపయోగించేది వివరణ ఇచ్చామని క్యాత్‌కార్ట్ చెప్పారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.