వాట్సప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ని తీసుకోస్తూనే ఉంటుంది. మరో కొన్ని రోజుల్లో కొత్త ఫీచర్ ని యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సప్ ప్రయత్నిస్తుంది. బల్క్ ఐటమ్‌లను ఒక సారి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేందుకు ఈ ఫీచర్ ని తీసుకొస్తునట్లు వాట్సప్ పేర్కొంది. దీని ద్వారా ఫోన్ స్టోరేజ్ ని పెంచుకోవచ్చు అని తెలిపింది. ఈ ఫీచర్ కి సంబంధించి అప్డేట్ ని వాట్సప్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. ‘సందేశాలు, ఫొటోలు, వీడియోలు ఎలాంటివైనా సమీక్షించడం.. ఒకే సారి పెద్దమొత్తంలో తొలగించడం, స్టోరేజీని పెంచుకునేలా చేయడాన్ని సులభతరం చేశాం’ అని తెలిపింది. ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందో వీడియోను వాట్సాప్‌ షేర్‌ చేసింది. త్వరలోనే ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.