గూగుల్ సర్చ్ లో ఫ్రీగా ఇమేజ్ స్ పొందడం ఎలా

మనం నిత్యం ఏదో ఒక దాని గురుంచి గూగుల్ లో వెతుకుతూ ఉంటాం. ఎక్కువ శాతం మనం గూగుల్ లభించే ఫోటోలను వాడుకోవాలని ప్రయత్నిస్తాం. ఇలా ఫోటో లను తిరిగి వాడటం వలన మనకు కాపీ రైట్స్ వస్తుంటాయి. అయితే దీనిని మనం నివారించవచ్చు.. గూగుల్ సర్చ్ బార్ లో అక్కడ మీకు కావాల్సిన ఇమేజ్ పేరు ఎంటర్ చేయండి. ఇప్పుడు దానికింద ఉన్న Images అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని ఎంచుకోండి, మీకు అక్కడ Settings పక్కన Tools అనే పేరు కనిపిస్తుంది. Tools అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే దాని కింద Usage Rights అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది.. దాన్ని క్లిక్ చేస్తే మీకు మూడు ఆప్షన్స్ All, Creative Commons licenses, Commercial & other licenses అనే పేరుతో మీకు కనిపిస్తాయి. ఇందులో All అనే ఆప్షన్ కాకుండా మిగతా రెండు ఆప్షన్ క్లిక్ చేస్తే వచ్చే ఫోటోలను తిరిగి ఉచితంగా వాడుకోవచ్చు. కానీ ఈ ఆప్షన్ లలో మనకు కావలసిన ఫోటో లు చాలా తక్కువ లభించే అవకాశం ఉంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.