ప్రతి ఒక్కరూ తమకు స్మార్ట్‌ఫోన్ గురుంచి అంత తెలుసు అనుకుంటారు. కానీ, మనకు స్మార్ట్‌ఫోన్ గురుంచి తెలిసింది చాలా తక్కువ అని చెప్పుకోవాలి. మన స్మార్ట్‌ఫోన్‌లలో హెడ్‌ఫోన్ జాక్ పక్కనే ఒక చిన్న రంద్రం ఉంటుంది. ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో ఈ రంద్రం ఉంటుంది. దీని గురుంచి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. అయితే దీనిని స్మార్ట్‌ఫోన్‌లో ఎందుకు ఏర్పాటు, దాన్ని ఏమని పిలుస్తారో తెలుసా?.
దానిపేరు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. దిని వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇది మన ఫోన్ కింది భాగంలో హెడ్‌ఫోన్ జాక్ లేదా స్పీకర్ పక్కన ఉంటుంది. మనం ఎప్పుడైనా మాట్లాడుతుంటే అవతలి వ్యక్తికి చాలా స్పష్టంగా వినబడటానికి ప్రధాన కారణం ఇదే. మనం ట్రాఫిక్, ఏదైనా రద్దీ ప్రాంతాలలో ఉండే సమయంలో ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు అవతలి వ్యక్తికి మన మాటలు స్పష్టంగా వినడటానికి ప్రధాన కారణం ఇదే. మనం మాట్లాడుతున్నప్పుడు బయట నుంచే వచ్చే పెద్ద శబ్దాలను రాకుండా ఈ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అడ్డుకుంటుంది. ఏదైనా దీనికి అడ్డుపెడితే మన స్పష్టంగా వినబడకపోవడమే కాకుండా, అసలు మనం ఏమి మాట్లాడుతున్నామో అవతలి వ్యక్తికి సరిగా అర్ధం కాదు. అందుకనే మనం మాట్లాడేటప్పుడు దీనికి ఏది అడ్డుపెట్టకూడదు.(ఇది చదవండి: ఫిబ్రవరి 8: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు!)
అయితే కొన్ని ఫోన్లకు కింది భాగంలో కాకుండా వెనుక భాగంలో కెమెరా పక్కన, కొన్నింటికి పక్కకు ఇస్తున్నారు. ఒకసారి మీ మొబైల్ ఈ మైక్ ఎటువైపు ఉందో చూడండి. మీరు బహిరంగ ప్రదేశాలలో మాట్లాడుతున్నపుడు దీనికి ఏదైనా అడ్డు పెట్టి చూడండి మీకే తెలుస్తుంది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.