లాటరీ అంటే ఒక లక్ష లేకపోతే ఒక కోటి రూపాయలో అని అనుకుంటాం. కానీ ఓ జంటకు రూ.1140 కోట్ల లాటరీ తగిలింది. మీరు విన్నది నిజమే ప్యాట్రిక్‌, ఫ్రాంకోయిస్ కోనోలీ అనే జంటకు అక్షరాల 115 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1140 కోట్లు) లాటరీ గెలుచుకున్నారు. ఇంత గెలిచిన లాటరీ డబ్బులతో మనం ఏమి చేస్తాం ఏదో వ్యాపారమో, స్టిరాస్తులు కొనుక్కోవడమే చేస్తాం కానీ వీరు సొమ్ములో సగం మొత్తాన్ని తమ బంధువులు, స్నేహితులు, సహాయం అవసరం ఉన్నవారికి పంచేశారు. (చదవండి: వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్ల‌ స్లాట్ బుకింగ్ ప్రారంభం)

వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్ కు చెందిన ప్యాట్రిక్‌, ఫ్రాంకోయిస్ కోనోలీ దంపతులకు 115 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1140 కోట్లు) లాటరీ గెలుచుకున్నారు. ఇంత మొత్తం గెలిచిన డబ్బులో నుండి దాదాపుగా 60 మిలియన్ డాలర్లు వారి బంధువులు, స్నేహితులు, డబ్బు అవసరం ఉన్నవారికి ఇచ్చారు. 50 మంది సన్నిహితులకు, 175 ఇతర కుటుంబాలకు సహాయం చేశారు. దీని ద్వారా వారు అప్పులను తీర్చుకోవడం, ఇళ్లను కొనుక్కోవడం చేశారు. ఫ్రాంకోయిస్ కోనోలీకి గత 25 సంవత్సరాలలో 4వ లాటరీ తగిలింది. వచ్చిన డబ్బుతో భీమా కూడా చేసుకున్నారు. ఈ డబ్బుతో కొనే ఆభరణాల ద్వారా వచ్చే ఆనందం కన్న డబ్బును ఆపదలో ఉన్న వారికి పంచినప్పుడు వచ్చిన ఆనందం దానికి వెయ్యి రేట్లు అని చెప్పింది. అంత పెద్ద మొత్తం వచ్చినా వారు అందులో సగం సొమ్మును ఇతరులకు పంచడంతో ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు మనవరాళ్లను కలిగి ఉన్న ఫ్రాంకోయిస్ కోనోలీ, వ్యాపారవేత్త పాట్రిక్, కుటుంబీకుల పుట్టిన రోజు సంధర్భంగా లాటరీ కొంటున్నారు. అలా కొన్న వాటిలో ఒక దానికి 2019 జనవరి 1న ఈ లాటరీ తగిలింది. అంత పెద్ద మొత్తం వచ్చినా వారు అందులో సగం సొమ్మును ఇతరులకు పంచడంతో ఇప్పుడు ఆ వార్త బయటికి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here