మనలో చాలా మంది ఎప్పుడో ఒక అప్పుడు మన ఆధార్ లో అప్ డేట్ కోసం మన దగ్గరలోని ఆధార్ సేవ కేంద్రాలు లేదా ఆధార్ ఎనరోల్ మెంట్ సెంటర్ లో కోసం వెళ్తాం అక్కడ కొన్ని సేవలు ఉచితంగా లభిస్తాయి మరికొన్ని వాటికి ఛార్జీలు వసూలు చేస్తారు. మనం ఏమి అనకుండా వారికి డబ్బులు చెలిస్తాం. ఇలాంటి ఇబ్బందులు ఎదురుకోకుండా ఉండటానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఆధార్ ఛార్జీలను సవరించింది. ఆధార్ కార్డ్ ను దేశ వ్యాప్తంగా 1.25 బిలియన్ మంది తీసుకున్నారు. ఆధార్ సేవలకు చెల్లించాల్సిన చార్జీల వివరాలను తమ అధికారిక వెబ్ సైట్ లో అప్ డేట్ చేస్తుంది. చివరి సారిగా 2020 మే 9న ఈ వివరాలను సవరించింది. ఆ వివరాల ప్రకారం ఆధార్ సేవలపై ఛార్జీలు ఎంత ఛార్జీలు తెలుసుకోండి.

ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ఉచితం
మ్యాన్‌డేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్స్ఉచితం
డెమొగ్రఫిక్ అప్‌డేట్‌తో పాటు బయోమెట్రిక్ అప్‌డేట్100 రూపాయలు
ఈ – మెయిల్50 రూపాయలు
మొబైల్ నెంబర్50 రూపాయలు
A4 షీట్ పై ఆధార్ ప్రింట్ కోసం30 రూపాయలు
(source: ఆధార్ అధికారిక వెబ్ సైట్)

మీరు పైన గమనించినట్లయితే ఆధార్ ఎన్ రోల్ మెంట్, మ్యాన్‌డేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్స్ వంటి సేవల్ని ఉచితంగా పొందవచ్చు. అలాగే డెమొగ్రఫిక్ అప్‌డేట్‌తో పాటు బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం 100 రూపాయలు, ఈ – మెయిల్ కోసం 50 రూపాయలు, మొబైల్ నెంబర్ 50 రూపాయలు,  A4 షీట్ పై ఆధార్ ప్రింట్ కోసం 30 రూపాయలు చెల్లించాలి. దేశ వ్యాప్తంగా అన్నీ ఆధార సేవ కేంద్రాలలో, ఎన్ రోల్ సెంటర్ లలో ఇవే ఛార్జీలు ఉంటాయి. దీనితో పాటు ఆన్ లైన్ లో ఉచితంగా చిరునామా (Address)ని సవరించవచ్చు. ఈ చార్జీలకు సంబంధించిన వివరాల కోసం https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లో వీక్షించండి.