గతంలో ఆపిల్ తన స్వంత ప్రాసెసర్ ద్వారా పనిచేసే మాక్‌బుక్ డివైస్ లను తీసుకొస్తునట్లు తెలిపింది. తాజాగా టెక్ దిగ్గజం ఆపిల్ సిలికాన్‌ ఎమ్‌1 ప్రాసెసర్‌తో మాక్‌బుక్ ఎయిర్, మాక్‌బుక్ ప్రో, మాక్ మినీ కంప్యూటర్లను విడుదల చేసింది. దీంతో సంప్రదాయ ఇంటెల్‌ ప్రాసెసర్‌లకు స్వస్తి పలికింది. తన కొత్త ఏఆర్‌ఎం ఆధారిత సిలికాన్‌ ఎమ్‌1 ప్రాసెసర్ల వినియోగానికి తెలిపింది. ఇప్పటివరకు వచ్చిన నివేదికల ప్రకారం కొత్త సిలికాన్ ఎమ్1 ప్రాసెసర్ అద్భుతంగా పనిచేయడంతో పాటు మెరుగైన బ్యాటరీ ఎక్కువ రోజులు పనిచేసేందుకు దోహదపడుతోందట.(చదవండి: జాగ్రత్త: 2 కోట్ల చైనా మొబైల్స్ లో ట్రోజన్ హార్స్‌ వైరస్)

ఇప్పుడు, వచ్చే ఏడాది రాబోయే కంపెనీ కొత్త మాక్ పరికరాల కోసం మరింత శక్తివంతమైన సిలికాన్ ఎమ్2 చిప్‌సెట్ తీసుకొస్తునట్లు సమాచారం. ఆపిల్ 5 ఎన్ఎమ్ తయారుచేయబడిన ఎం2 చిప్‌సెట్‌ను 2021 ప్రారంభంలో రాబోయే కొత్త 13-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో, 16- అంగుళాల మాక్‌బుక్ ప్రోలో తీసుకొస్తునట్లు సమాచారం. కొత్తగా రూపొందించిన రెండు మాక్‌బుక్ ప్రో మోడళ్లను వచ్చే ఏడాది లాంచ్ చేయాలని యాపిల్ యోచిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 2022 సంవత్సరంలో, మినీ-ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో కూడిన మ్యాక్‌బుక్ ప్రో మరియు మాక్‌బుక్‌లతో పాటు రిఫ్రెష్ చేసిన మాక్‌బుక్ ఎయిర్‌ను కంపెనీ విడుదల చేయనున్నట్లు సమాచారం. 2021లో ఆపిల్ రెండు GaN ఛార్జర్‌లను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, కొత్త మాక్‌బుక్ మోడళ్లలో చిన్న ఛార్జర్ల‌ను మనం ఆశించవచ్చు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here