టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అరచేతిలోకి ప్రపంచం వచ్చింది అనేది వాస్తవం. ముఖ్యంగా స్మార్ట్‌వాచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. దీంతో చాలా మంది అత్యంత ప్రమాదకర సంఘటనల నుంచి బయటపడ్డారు. తాజాగా అలాంటి సంఘటన అమెరికాలోని టెక్సాస్ లో జరిగింది. యాపిల్ స్మార్ట్‌వాచ్ కిడ్నాపర్ల భారీ నుంచి మహిళను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది. టెక్సాస్‌లోని సెల్మా ప్రాంతానికి చెందిన ఒక మహిళ తాను ఆపదలో ఉన్నానని తనను రక్షించాలని తన కూతురికి యాపిల్ స్మార్ట్‌వాచ్‌ ద్వారా సమాచారాన్ని అందించింది.(ఇది చదవండి: పీఎం కిసాన్ రైతుల కోసం మరో పథకం.. ప్రతి నెల ఖాతాలోకి రూ.3వేలు?)

అయితే, ఆమె ఉన్న ప్రదేశం గురుంచి పూర్తి సమాచారం తెలుసుకునేలోపే కనెక్షన్ కట్ అయ్యింది. దీంతో ఆమె స్థానికంగా ఉన్న పోలీసులను ఆశ్రయించింది. వారు కిడ్నాప్ గురైన మహిళా ధరించిన యాపిల్ స్మార్ట్‌వాచ్‌ ని ఎమర్జెన్సీ సెల్యూలార్‌ పింగ్ సాయంతో ట్రాక్ చేయడం ప్రారంభించారు. కిడ్నాపర్ పట్టుకునే క్రమంలో హయత్ ప్లేస్ హోటల్‌లోని ఈస్ట్ సోంటెర్రా బ్లవ్‌డిలోని పార్కింగ్ స్థలంలో కిడ్నాప్ గురైన మహిళా ఒక వాహనంలో కనిపించింది. వెంటనే పోలీసులు బాధిత మహిళను రక్షించి కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కిడ్నాప్ గురైన మహిళా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి యాపిల్ స్మార్ట్‌వాచ్ కాపాడటం ఇది మొదటి సారి కాదు. ఇంతక ముందు గత సంవత్సరం 25 ఏళ్ల వ్యక్తిని గుండెపోటు నుంచి రక్షించింది. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్‌లో ప్రాణాపాయం నుంచి ఒక వృద్ధుడిని కాపాడింది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.