భారత సరహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్నా చైనాకి ధీటుగా సమాధానం ఇస్తూ సెప్టెంబర్ 2వ తేదీన ఆ దేశానికి చెందిన 118 యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి మనకు తెలిసిందే. ఆ నిషేదం విధించిన జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా భాగా గుర్తింపు పొందిన పబ్జీ గేమ్ కూడా ఆ జాబితాలో ఉంది. అయితే పబ్జీ పై నిషేదం విధించిన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఒక కీలక ప్రకటన ట్విట్టర్ వేదికగా చేశారు. త్వరలో ఒక మల్టీ ప్లేయర్ గేమ్ ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో టిక్ టాక్ తో పాటు 59 యాప్ లపై నిషేదం విధించినప్పుడు దేశ ప్రధాని మనం దేశ యువత కూడా ఇలాంటి యాప్ లను రూపొందించాలి అని అన్నారు. ప్రధాన మంత్రి పిలుపునిచ్చిన “ఆత్మ నిర్భర్ భారత్” దీన్ని తీసుకొస్తునట్లు అక్షయ తెలిపారు. త్వరలో ఈ గేమ్ ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ గేమ్ కు ఫౌజీ(FAU-G) ఫియర్ లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ అని పేరు పెట్టారు. ఈ గేమ్ కేవలం వినోదమే కాకుండా.. మన సైనికుల యొక్క పరాక్రమలను మరియు త్యాగలను తెలియజేయబోతునట్లు అన్నారు. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతాన్ని భారత్ కి వీర్ ట్రస్ట్ కి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ గేమ్ ను బెంగళూరు కు చెందిన ఎన్ కోర్ గేమ్స్ రూపొందిస్తుంది. ఫౌజీ అంటే హిందీ భాషలో సైనికుడు అని అర్దం. అక్షయ కుమార్ వీడుధల చేసిన పోస్టర్ ని గమనించినట్లయితే సైనికుల భుజాలపై మన దేశ త్రివర్ణ పతాకం ఉంది.