భారత్ దేశంలోని ప్రతి ఒక్కరికీ పబ్లిక్ వై-ఫై సేవలను అందించే ప్రయత్నంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం తీసుకొస్తున్న పీఎం వై-ఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఏర్పాటు కోసం టెలికమ్యూనికేషన్స్ విభాగం (డిఓటి) పంపిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. భారతదేశంలో భారీ వైఫై నెట్‌వర్క్‌ను ప్రారంభించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా పబ్లిక్ డేటా సెంటర్లను తెరుస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ పబ్లిక్ వై-ఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్ పీఎం వాణి(PM-WANI) అని పిలువబడుతుంది. ఈ వై-ఫై నెట్‌వర్క్‌ల ద్వారా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను అందించడానికి లైసెన్స్ ఫీజు ఉండదు. దేశంలో వైఫై నెట్వర్క్ వృద్ధిని ప్రోత్సహించేందుకే ఈ ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు.(చదవండి: వాట్సప్ లో ఇన్ నోటిఫికేషన్ ఫీచర్)

దేశంలో 4G మొబైల్ కవరేజ్ లేని ప్రాంతాలతో సహా దేశంలో అధిక సంఖ్యలో చందాదారులకు స్థిరమైన మరియు హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ (డేటా) సేవలను అందించాల్సిన అవసరం ఉంది అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. పబ్లిక్ వై-ఫై ద్వారా ఉపాధి పెరగడంతో పాటు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఆదాయం పెంచుతుందన్నారు. మొత్తంగా ఈ ప్రయత్నం దేశ జీడీపీని వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. పీఎం వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్‌ఫేస్ పీఎం వాణిలో వేర్వేరు ప్లేయర్స్ ఉంటారు. పబ్లిక్ డేటా ఆఫీస్-PDO, పబ్లిక్ డేటా అగ్రిగేటర్-PDOA, యాప్ ప్రొవైడర్, సెంట్రల్ రిజిస్ట్రీ లాంటివి ఉంటాయి. (చదవండి: మార్కెట్ లోకి మరో బడ్జెట్ మోటోరోలా ఫోన్)

పబ్లిక్ డేటా ఆఫీస్-PDO వైఫై యాక్సెస్ పాయింట్స్‌ని ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణ, చందాదారులకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది. పబ్లిక్ డేటా అగ్రిగేటర్-PDOA ఆథరైజేషన్, అకౌంటింగ్‌కు సంబంధించిన విధులను నిర్వహిస్తుంది. PM-Wani ప్రాజెక్టు ద్వారా ఏర్పాటైన వైఫై హాట్‌స్పాట్స్ కోసం యాప్‌ను రూపొందించే బాధ్యత యాప్ ప్రొవైడర్లది. ఇక సెంట్రల్ రిజిస్ట్రీలో యాప్ ప్రొవైడర్స్, పబ్లిక్ డేటా ఆఫీస్-PDO, పబ్లిక్ డేటా అగ్రిగేటర్-PDOA వివరాలు ఉంటాయి. PDOలకు ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, PDOAలు మరియు యాప్ ప్రొవైడర్లు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించకుండా DoT యొక్క ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుంటారు. దరఖాస్తు చేసిన 7 రోజుల్లో రిజిస్ట్రేషన్ మంజూరు చేయబడుతుందని కేబినెట్ తెలిపింది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here